'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే? | Animal Movie Actress Tripti Dimri Details | Sakshi
Sakshi News home page

Animal Movie Actress: కిస్సులు, రొమాన్స్‌లో రెచ్చిపోయింది.. చివరకు ఆ సీన్‌లోనూ!

Dec 2 2023 5:13 PM | Updated on Dec 2 2023 5:26 PM

Animal Movie Actress Tripti Dimri Details - Sakshi

'యానిమల్' మీలో చాలామంది చూసే ఉంటారు. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. సరే అదంతా పక్కనబెడితే సినిమాలో చాలామంది వావ్ అనిపింంచారు. హీరో రణ్‌బీర్ కపూర్ వేరే లెవల్ యాక్టింగ్‌తో ఇచ్చిపడేశారు. హీరోయిన్ రష్మిక కూడా ఆశ్చర్యపరిచింది. కానీ ఈమె కంటే మరో బ్యూటీ.. ఈ మూవీలో ఎక్కువ హైలైట్ అయ్యింది. కిస్సలు, రొమాన్స్‌తో రెచ్చిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

ఎవరా బ్యూటీ?
'యానిమల్' సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే రణ్‌బీర్-రష్మిక పాత్రలకు పెళ్లయిపోతుంది. దీంతో హీరోయిన్‌ రష్మిక పాత్రకు గ్లామర్ చూపించడానికి కుదరదు. దీంతో ఇంటర్వెల్ తర్వాత జోయా అనే పాత్ర ఎంటర్ అవుతుంది. బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి.. ఈ క్యారెక్టర్ చేసింది. విలన్ గ్యాంగ్‌కి చెందిన ఈమె.. సీక్రెట్‌గా రహస‍్యాలు తెలుసుకోవడానికి హీరో దగ్గరికి వస్తుంది. తెలియకుండానే అతడితో ప్రేమలో పడిపోతుంది.

(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే)

అలాంటి సీన్‌లోనూ
దీంతో ఈ రెండు పాత్రల మధ్య రొమాన్స్ దగ్గర కిస్సులు ఓ రేంజులో ఉంటాయి. ఓ సీన్‌లో అయితే బెడ్‌పై నగ్నంగా కనిపించే సీన్ ఒకటుంటుంది. ఇందులో రణ్‌బీర్-తృప్తి దిమ్రి రెచ్చిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే రష్మిక పాత్ర కంటే తృప్తి పాత్రనే ఎక్కువ హైలైట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే 'యానిమల్' మూవీ గురించి.. లేదంటే 'తృప్తి దిమ్రి' గురించే మాట్లాడుకుంటున్నారు.

తృప్తి బ్యాక్‌గ్రౌండ్
ఈమె అసలు పేరు లైలా తృప్తి దిమ్రి. ఓటీటీ అభిమానులు మాత్రం ఈ బ్యూటీని 'బుల్‌బుల్' అని ముద్దుగా పిలుస్తారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ లో తృప్తి పుట్టింది. 2017లో 'పోస్టర్ బాయ్స్' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 'లైలా మజ్ను', 'బుల్ బుల్' సినిమాలు చేసింది. ఇకపోతే 'బుల్ బుల్' మూవీ ప్రొడ్యూసర్ కర్నేశ్‌తో ఈమె డేటింగ్‌లో ఉందని రూమర్స్ ఉన్నాయి. ఇకపోతే సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల కంటే సెకండాఫ్‌లో కనిపించిన బ్యూటీస్ అనుకోని విధంగా హైలైట్ కావడం విశేషం.

(ఇదీ చదవండి: Animal Review: ‘యానిమల్‌’మూవీ రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement