రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ కావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇందులో పాకిస్తాన్‌ను నెగెటివ్‌గా చూపించారంటూ అరబ్ దేశాలు దురంధర్‌పై నిషేధం విధించాయి. ఈ మూవీని బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ, యూఏఈ బ్యాన్ చేశాయి. దీంతో ఆయా దేశాల్లో దురంధర్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో పాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తావనలు ఉన్నాయనే అరబ్ దేశాలు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్ దేశాల్లోని థియేటర్లలో దురంధర్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ కొన్నిచోట్ల అసలు అనుమతులు కూడా రాలేదు. దీంతో చివరికీ కొన్ని థియేటర్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. రూ.200 కోట్ల దిశగా దురంధర్ దూసుకెళ్తోంది.


