breaking news
The Great Pre Wedding Show Movie
-
తండ్రైన టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్.. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో అభిమానులను మెప్పించాడు. అంతేకాకుండా జార్జ్ రెడ్డి, టక్ జగదీష్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇటీవలే రిలీజైన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిత్రంతో అభిమానులను అలరించారు. టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా తిరువీర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రైనట్లు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. నాయినొచ్చిండు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తిరువీర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్. తెలంగాణకు చెందిన తిరువీర్ 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 2016 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఇతను.. ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్, మోక్షపటం చిత్రాల్లో నటించారు.గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తిరువీర్. ఈ ఏడాది మార్చిలో సొంతూరిలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. 'రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక' అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఆగస్టులో తన తిరువీర్ భార్య కల్పన సీమంతం వేడుక చేశారు. అలా తిరువీర్ తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసింది. నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03— Thiruveer (@iamThiruveeR) December 12, 2025 -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'అఖండ 2' మాత్రమే రాబోతుంది. హిందీలో 'ధురంధర్' అనే చిత్రం రిలీజ్ కానుంది. ఇవి రెండు తప్పితే వేరే చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం హిట్ సినిమాలు చాలానే రాబోతున్నాయి. తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఈ లిస్టులో ఉండటం విశేషం.(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్)ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ఈ వీకెండ్ రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్', 'థామా'తో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, డీయస్ ఈరే, స్టీఫెన్ చిత్రాలు కచ్చితంగా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, సిరీస్‌లు రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (డిసెంబరు 01 నుంచి 07 వరకు)నెట్ఫ్లిక్స్ట్రోల్ 2 (నార్వేజియన్ సినిమా) - డిసెంబరు 01కిల్లింగ్ ఈవ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 02మై సీక్రెట్ శాంటా (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 03ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05అమెజాన్ ప్రైమ్థామా (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02 (రెంట్ విధానం)ఓ వాట్ ఫన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 03ఆహాధూల్పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05హాట్స్టార్ద బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05జీ5ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05ఘర్వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05సోనీ లివ్కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05సన్ నెక్స్ట్అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05ఆపిల్ టీవీ ప్లస్ద హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 03ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05బుక్ మై షోద లైఫ్ ఆఫ్ చక్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 04(ఇదీ చదవండి: హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇంట్లో యువతి ఆత్మహత్య) -
ఓటీటీలోకి లేటెస్ట్ కామెడీ హిట్ సినిమా
అన్నిసార్లు పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా అద్భుతాలు చేస్తుంటాయి. ప్రేక్షకుల్ని మనసారా నవ్విస్తాయి. అలాంటి ఓ చిత్రమే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ సినిమాని ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. రాహుల్ శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు తీసినప్పటికీ తొలి ఆట నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే.. ఓ ఫొటోగ్రాఫర్ ఎలాంటి తిప్పలు పడ్డాడు? దీని నుంచి వచ్చే కామెడీ అనే సింపుల్ పాయింట్‌తో తీసిన సినిమా ఇది. చెబుతుంటే స్టోరీ ఇంతేనా అనిపిస్తుంది గానీ చూస్తున్నప్పుడు మాత్రం మంచి కామెడీతో అలరిస్తుంది. నవంబరు 7న థియేటర్లలోకి రాగా పాజిటివ్ టాక్‌తో పాటు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబరు 5 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో మిస్ అయినోళ్లు ఓటీటీలోకి వచ్చాక తప్పక చూడండి.(ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' విషయానికొస్తే.. పల్లెటూరిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంలో ఆరితేరిన ఫొటోగ్రాఫర్ రమేశ్ (తిరువీర్). స్టూడియోకి ఎదురుగా ఉండే పంచాయతీ ఆఫీస్‌లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ని ఇష్టపడుతంటాడు. ఆమెకీ రమేశ్ అంటే ఇష్టమే. కట్ చేస్తే రమేశ్ దగ్గరకు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమని ఆనంద్(నరేంద్ర రవి) వస్తాడు. రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడు ఆనంద్. షూట్ అంతా అయ్యాక మెమరీ కార్డ్ తన దగ్గర పనిచేసే సహాయకుడు రాము(మాస్టర్ రోహన్) చేతికి రమేశ్ ఇస్తాడు.ఆ కుర్రాడేమో మెమొరీ చిప్ ఎక్కడో పడేస్తాడు. అప్పటినుంచి రమేశ్‌కి కష్టాలు మొదలవుతాయి. చిప్ లేదనే సంగతి ఆనంద్కి తెలిస్తే ఏమవుతుందోననే భయం ఓవైపు రమేశ్‌ని వెంటాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ గండం నుంచి బయటపడాలి. ఈ విషయంలో రమేశ్‌కి హేమ ఏం సాయం చేసింది? చివరకు మెమొరీ చిప్ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సారీ చెప్పిన 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్) -
నవ్వుల బంతి భోజనంలా ‘ప్రీ వెడ్డింగ్ షో’.. తిర్వీర్ ఆనందం
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రమిదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి. బుకింగ్స్ పెరగడం పట్ల హీరో తీర్వీర్ ఆనందం వ్యక్తం చేశాడు‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. మా సినిమాపై ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రోత్సహిస్తున్న మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు’’ అని తిరువీర్ చెప్పారు. -
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)మహేశ్‌బాబు బావమరిది సుధీర్‌బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్‌లో ఉంది.(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ
మూవీ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోనటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులునిర్మాణ సంస్థ: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్నిర్మాత: అగరం సందీప్రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్సంగీతం: సురేష్ బొబ్బిలిసినిమాటోగ్రఫి: సోమశేఖర్ఎడిటర్: నరేష్ అడుపవిడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే.. విజయనగరం జిల్లాకు చెందిన రమేశ్(తీరువీర్) ఓ ఫోటోగ్రాఫర్. ఊర్లోనే ఓ ఫోటో స్టూడియో పెట్టుకొని పెళ్లిళ్లతో పాటు ఇతర కార్యక్రమాల ఫోటోలు తీస్తుంటాడు. అతని అసిస్టెంట్ రామ్(రోహన్ రాయ్)కి పనిమీద కంటే తిండిమీదే ధ్యాస ఎక్కువ. రామ్ చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా..తన స్టూడియోకి ఎదురుగా ఉన్న పంజాయితీ ఆఫీస్‌లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ను ప్రేమిస్తూ ఉంటాడు రమేశ్. హేమకు కూడా రమేశ్ అంటే ఇష్టమే కానీ..ఒకరికొకరు బయటకు చెప్పుకోకుండా చూపులతోనే ప్రేమించుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు. కట్ చేస్తే.. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్(నరేంద్ర రవి) రమేశ్ స్టూడియో దగ్గరకు వచ్చి.. జిల్లాలోనే ది బెస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ చేయాలని అడ్వాన్స్ ఇచ్చివెళ్లిపోతారు. ఔట్‌డోర్‌లో షూటింగ్ అంటే..తనకు కాబోయే భార్య సౌందర్య(యామిని)తీసుకొని జిల్లాకు వెళ్తాడు. దాదాపు లక్షన్నర వరకు ఖర్చు చేయించి..షూట్ కంప్లీట్ చేస్తాడు. ఆ షూట్ ఫుటేజ్ చిప్‌ని తన అసిస్టెంట్ రామ్ కి ఇచ్చి..స్టూడియోలో పెట్టమని చెప్తాడు. పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టని రామ్.. ఆ చిప్‌ని ఎక్కడో పారేస్తాడు. ఈ విషయం ఆనంద్‌కు తెలిస్తే..ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో రమేశ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? తన నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత రమేశ్ ఏం చేశాడు? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఏంటి? రమేశ్ తీసుకున్న నిర్ణయం ఆయనతో పాటు ఆనంద్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు రమేశ్‌కు హేమ ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఆనంద్, సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద కథ అవరసరం లేదు. సింపుల్ స్టోరీ అయినా సరే.. చెప్పాలనుకునే పాయింట్‌ని సిన్సియర్‌గా తెరపై చూపిస్తే చాలు.. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చాలా సింపుల్ కథను ఎంచుకొని.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ జోలికి పోకుండా.. లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు. స్టార్స్‌ని కాకుండా కంటెంట్‌ని నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక్క సంఘటన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది? సందర్భాన్ని బట్టి మనిషి స్వభావం ఎలా మారుతుందనే విషయాన్ని కామెడీ వేలో చక్కగా చూపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగానే సాగుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు తక్కువే ఉన్నప్పటికీ.. అవి అలా గుర్తిండిపోతాయి. ఫస్టాఫ్ మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. ఆనంద్, సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్.. చిప్ పోవడం.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు హీరో చేసే ప్రయత్నాలు...ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. పెళ్లి చెడగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు..కొంతవరకు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లను కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆనంద్, సౌందర్యలు విడిపోవడానికి గల కారణం నవ్విస్తూనే..ఆలోచింపజేస్తూంది. ఆటో సీన్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో హీరో చెప్పే డైలాగ్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. అవేవి పట్టించుకోకుండా చూస్తే.. అందరికీ నచ్చేస్తుంది. కామెడీ పేరుతో వల్గారిటీని చూపిస్తున్న ఈ రోజుల్లో.. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడంలో తీరువీర్ దిట్ట. ఈ సారి కూడా అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫోటోగ్రాఫర్ రమేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై అమాయకత్వంగా కనిపిస్తూనే..హీరోయిజాన్ని పండించాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర నరేంద్ర రవిది. పెళ్లికొడుకు ఆనంద్ పాత్రలో ఆయన జీవించేశాడు. నవ్విస్తూనే కొన్ని చోట్ల భావోధ్వేగానికి గురి చేస్తాడు. హేమా పాత్రకు టీనా శ్రావ్య న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మరోసారి తనదైన నటనతో నవ్వులు పూయించాడు. యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక నిపుణులకొస్తే సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే?
ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు)ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?నవంబర్ 7న రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ 'ఆర్యన్' కూడా తెలుగులో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
తల్లి చనిపోయిన విషయం దాచి షూటింగ్ చేశాడు.. తిరువీర్‌పై దర్శకుడు ప్రశంసలు!
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’(The Great Pre Wedding Show ). సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్లో సీన్ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.హీరో తిరువీర్ మాట్లాడుతూ .. దర్శకుడు రాహుల్ ఈ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్‌ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని చిత్ర నిర్మాత సందీప్ అగరం అన్నారు.


