ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.
(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు)
ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?
నవంబర్ 7న రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ 'ఆర్యన్' కూడా తెలుగులో విడుదల కానుంది.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)


