ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాన్నాళ్ల క్రితం రిలీజైన చిత్రాల్ని కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తుంటారు. ఇప్పుడు అలానే గతేడాది రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు సడన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు కథల ఆంథాలజీతో తీసిన ఈ చిత్రం.. ఏ ఓటీటీలో చూడొచ్చు? ఇంతకీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కొన్నేళ్ల క్రితం ఆంథాలజీ ట్రెండ్ బాగానే నడిచింది. తెలుగులోనూ కేరాఫ్ కంచరపాలెం, చందమామ కథలు, పంచతంత్రం లాంటి ఒకటి రెండు మూవీస్ వచ్చాయి. ఇదే జానర్‌లో గతేడాది సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన మూవీ 'లైఫ్ స్టోరీస్'. ఆరు కథలు, 11 మంది యాక్టర్స్ నటించిన ఈ సినిమాలో స్నేహం, సంతోషం, ఒంటరితనం, పశ్చాత్తపం, యవ్వనపు ప్రేమ, సాంగత్యం అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఈ కథలన్నీ చివరలో లింక్ చేశారు.
(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్)
థియేటర్లలో రిలీజైనప్పుడు ఓ మాదిరి రెస్పాన్స్ అందుకున్న 'లైఫ్ స్టోరీస్'.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్నిరోజుల్లో ఉచితంగానూ అందుబాటులోకి రావొచ్చు. ఈ ఆంథాలజీ చిత్రంలో క్యాబ్ క్రానికల్స్, ది మామ్, గ్లాస్ మేట్స్, జిందగీ, బంగారం, ది వైల్డ్ హట్స్ అనే టైటిల్స్‌తో స్టోరీలని చూపించారు. అన్నీ కూడా డీసెంట్‌గానే ఉంటాయి. కుదిరితే ఓ లుక్కేయండి.
'లైఫ్ స్టోరీస్' విషయానికొస్తే.. ఇంజినీర్‌గా జాబ్ చేసి మనశ్శాంతి లేకపోవడంతో ఓ వ్యక్తి డ్రైవర్‌గా మారతాడు. ఓ రోజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ క్యాబ్ ఎక్కుతాడు. వీళ్ల మధ్య జరిగిన సంభాషణ ఏంటి అనేది ఓ స్టోరీ. తల్లితో(దేవయాని) కలిసి ఆనందంగా గడపాలని ఓ చిన్నారి ఆశపడుతుంటాడు. కానీ ఉద్యోగం కారణంగా కొడుక్కి సదరు తల్లి అస్సలు సమయం ఇవ్వలేకపోతూ ఉంటుంది. కొడుకు ఆనందం కోసం తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఓ స్టోరీ.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)
సతీష్.. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు భార్యతో కలిసి ఓ రిసార్ట్‌కి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు మంగేశ్ కనిపిస్తాడు. మాట్లాడుతూ వీళ్లిద్దరూ బాల్యంలోకి వెళ్లిపోతారు. మరోవైపు వీళ్లిద్దరి భార్యల మధ్య సాగిన డిస్కషన్ ఏంటనేది మరో స్టోరీ. ఐటీ ఉద్యోగి పీయూష్.. తన ప్రియురాలితో కలిసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్లాన్ రివర్స్ అవుతుంది. దీంతో ఒంటరిగానే వికారాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైందనేది ఓ స్టోరీ.
మంగమ్మ.. రోడ్ పక్కన ఓ టీ దుకాణం నడుపుతూ ఉంటుంది. ఈమె ఒంటరి జీవితంలోకి ఓ కుక్క వస్తుంది. దీంతో ఆ శునకానికి బంగారం అని పేరు పెట్టి పెంచుకుంటుంది. మరి బంగారంతో మంగమ్మకు ఎలాంటి బాండింగ్ ఏర్పడింది? అనేది ఓ స్టోరీ. శ్రియా.. తన భర్తతో కలిసి న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ బాస్ పనిఅప్పజెప్పడంతో ఆఫీస్‌లోనే ఉండిపోతుంది. మరి భర్తతో కలిసి పార్టీ చేసుకోవాలనే కోరిక తీరిందా లేదా అనేది మరో స్టోరీ.
(ఇదీ చదవండి: హీరోయిన్‌గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ)


