రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. నవంబర్ 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. అయితే, నెటిజన్లలో కొందరు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ‘చిన్ని గుండెలో’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదుర్స్ అని ప్రశంసలు వచ్చాయి. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను మెర్విన్, సత్య యామిని ఆలపించగా.. వివేక్- మెర్విన్ స్వరాలు సమకూర్చారు. ఇందులో కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.


