OTT: ‘త్రీ రోజెస్ సీజన్‌ 2’ రివ్యూ | 3 Roses Season 2 Web Series Review And Rating In Telugu, A Comedy Drama About Women Finding Their Own Path | Sakshi
Sakshi News home page

OTT Series Reviews: ‘త్రీ రోజెస్ సీజన్‌ 2’ రివ్యూ

Dec 14 2025 12:42 PM | Updated on Dec 14 2025 1:09 PM

3 Roses Season 2 Web Series Review And Rating

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్‌ 2’. 2021లో ఆహాలో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన త్రీ రోజెస్‌ వెబ్‌ సిరీస్‌కి సీక్వెల్‌ ఇది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి త్రీ రోజెస్‌ సీజన్‌ 3 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (3 Roses Season 2 Review)

కథేంటంటే.. 
రీతూ అలియాస్ రిత్విక (ఈషా రెబ్బా), మేఘన (రాశి సింగ్) , సృష్టి (కుషితా కల్లపు) ముంబైలో ఒకే హాస్టల్‌ ఉంటారు. సమీర్‌తో బ్రేకప్‌ తర్వాత రీతూ కెరీర్‌పై ఫోకస్‌ పెడుతుంది.  వీరభోగ వసంత రాయలు(సత్య)తో విడాకులు తీసుకున్న  మేఘన.. ఆ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్‌ చేస్తూ మాజీ భర్త ఇచ్చిన భరణంతో లైఫ్‌ లీడ్‌ చేస్తుంది. సృష్టికేమో కొరియన్‌ డ్రామాల పిచ్చి. ప్రతీది కొరియన్‌ కళ్లతోనే చూస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఓ యాడ్‌ ఏజెన్సీ పెడతారు.  కానీ వారికి ఒక్క యాడ్‌ కూడా రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడతాయి. చివరగా వీరికి ప్రసాద్‌(హర్ష చెముడు) గోల్డ్ జ్యూవెలరీకి సంబంధించిన యాడ్‌ ఇవ్వడానికి వస్తాడు. ప్రసాద్‌ ఎంట్రీతో ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పేంటి? వీరిని ట్రాప్‌ చేయాలనుకున్న వారి నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. 

విశ్లేషణ
తమకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకునే ముగ్గురు అమ్మాయిల కథ ఈ సిరీస్‌. అమ్మాయిల స్వేచ్ఛ, సాధికారతల గురించి ఈ సిరిస్‌లో వినోదాత్మకంగా చర్చించారు. ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అని తెలుసుకొని.. ఫేక్‌ బంధాల నుంచి బయటపడటంలోనే అసలైన ఆనందం ఉంటుంది అంటూ మంచి సందేశం అందించారు.

సీజన్‌ 2లో మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉండగా..ప్రస్తుతానికి మాత్రం నాలుగు ఎపిసోడ్స్‌ మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మొదటి ఎపిసోడ్‌లో ప్రధాన పాత్రల పరిచయం మాత్రమే ఉంటుంది. ఇక రెండో ఎపిసోడ్‌ నుంచి అసలు కథ మొదలవుతుంది. సీజన్‌ 1 లాగే సీజన్‌ 2లో కూడా కామెడీ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. అయితే సీజన్‌ 1లో ముగ్గురు యువతులకు వేరు వేరు సమస్యలు ఉండగా...ఇందులో ముగ్గురు కలిసి ఒకే సమస్యను ఎదుర్కొంటారు.

సొంతకాళ్లపై బతికేందుకు ముగ్గురు అమ్మాయిలు యాడ్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయడం.. ఈ క్రమంలో గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నవారే మళ్లీ రీతూ లైఫ్‌లోకి రావడం... మరోవైపు ఒంటరిగా ఉన్న అమ్మాయిల బలహీనలతను ఆసరాగా చేసుకొని.. తమకి అనుకూలంగా మార్చుకునేవాళ్లు..   ఈ క్రమంలో వచ్చే సీన్లన్నీ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇందులో మంచి సందేశం ఇచ్చారు. ఏది ప్రేమ, ఏది వ్యామోహమో తెలియకుండా ఎలా మోసపోతున్నారనేది చూపించిన తీరు బాగుంది. నాలుగు ఎపిసోడ్స్‌ ఇంకా రిలీజ్‌ కాలేదు..కాబట్టి పూర్తి కథనం చూసిన ఫీలింగ్‌ రాలేదు. రొటీన్‌ కథే అయినా.. కథణం బాగుంటుంది.  

నటీనటుల విషయానికొస్తే..  ప్రధాన పాత్రల్లో నటించిన ఈషా రెబ్బా,  రాశీ సింగ్‌, కుషిత కల్లపు కూడా చాలా బాగా నటించారు. గ్లామర్‌ పరంగాను అలరించారు. సత్య కామెడీ నవ్వులు పూయించింది.  ఇక అమ్మాయిల పిచ్చి ఉన్న పాత్రలో ప్రభాస్‌ శ్రీను కూడా తన పరిధిమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. వైవా హర్షతో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతికంగా సిరీస్‌ బాగుంది.  అజయ్‌ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి ప్లస్‌ అయింది. శక్తి అరవింద్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా కనబడుతుంది. విజయ్‌ ముక్తవరపు ఎడిటింగ్‌ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement