ప్రియదర్శి పులికొండ, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమంటే. ఈ మూవీలో సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కంచారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ప్రేమంటే కథేంటంటే..
మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీ.
Andhamaina vaibhavala veduka ey kadha premante 🤩❤️ pic.twitter.com/NF7ic6xETm
— Netflix India South (@Netflix_INSouth) December 14, 2025


