నేను కూడా అప్పట్లో అనుకున్నా.. కానీ అది అబద్ధం | Malavika Mohanan Clarify On Acting With Chiranjeevi | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: నేనా చిరంజీవితోనా? 'రాజాసాబ్' బ్యూటీ ట్వీట్

Oct 29 2025 1:14 PM | Updated on Oct 29 2025 1:22 PM

Malavika Mohanan Clarify On Acting With Chiranjeevi

చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా 'విశ్వంభర' కూడా లైన్‌లో ఉంది. లెక్క ప్రకారం విశ్వంభర ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా చాలా ఆలస్యం చేసేశారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కాకుండా మరో రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి.

చిరు.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రంలో తమిళ హీరో కార్తీ నటించనున్నాడని, ఏకంగా రూ.23 కోట్ల రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేశాడనే రూమర్స్. సరే ఇదంతా పక్కనబెడితే ఈ ప్రాజెక్టులో చిరంజీవి సరసన మాళవిక మోహనన్ నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా మాళవికనే స్పందించింది. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)

'డైరెక్టర్ బాబీ తీయబోయే 'మెగా 158' ప్రాజెక్టులో నేను ఉన్నానని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను కూడా చిరంజీవి సర్‌తో నటించాలని ఓ దశలో అనుకున్నా. కానీ ఇప్పుడు క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టులో నేను లేను. వినిపిస్తున్న రూమర్స్ నిజం కాదు' అని మాళవిక మోహనన్ ట్వీట్ చేసింది.

మాళవిక చెప్పేసింది కాబట్టి ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనేది తేలాల్సి ఉంది. బాబీ కాకుండా యువదర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా చిరంజీవితో ఓ మూవీ చేయనున్నాడు. దీని గురించి కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చేసింది. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే అవకాశముంది.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement