'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్ | Pawan Kalyan Ustaad Bhagat Singh Movie First Song | Sakshi
Sakshi News home page

Ustaad Bhagat Singh: పవన్-హరీశ్ శంకర్ సినిమా.. తొలి సాంగ్ రిలీజ్

Dec 13 2025 6:32 PM | Updated on Dec 13 2025 6:45 PM

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie First Song

పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ 'గబ్బర్ సింగ్' చేశారు. అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు. ఇప్పటికే పవన్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు.

(ఇదీ చదవండి: అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత)

'దేఖ్ లేంగ్ సాలా' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశారు. బీట్ బాగానే ఉంది కానీ ఎక్కడో విన్నామే ఇది అనిపించేలా మ్యూజిక్ ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.

ఈ సినిమా విషయానికొస్తే.. తమిళ హీరో విజయ్ 'తెరి'కి ఇది రీమేక్ అని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం కొత్త స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైతే తప్ప కంటెంట్ ఏంటనేది క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. రీమేక్ అనే రూమర్స్ దీనికి కారణం. అలానే దర్శకుడు హరీశ్ శంకర్ గత కొన్ని చిత్రాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement