సూపర్‌స్టార్ రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే తమిళ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ఈయన 'జైలర్ 2' చేస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం.
చెప్పాలంటే ఈ పాటికే రజనీకాంత్ రిటైర్మెంట్ ఇచ్చేసేవారేమో! ఎందుకంటే 2010లో 'రోబో' చేసిన తర్వాత సినిమాలైతే చేస్తూ వచ్చారు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. మధ్యలో 'రోబో 2.0' కొంతమేర పర్వాలేదనిపించింది. అయితే 'జైలర్' బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఈయనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లుంది. దీంతో లాల్ సలాన్, వేట్టయాన్ చిత్రాలు చేశారు. కానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది 'కూలీ'తో ఏకంగా రూ.1000 కోట్ల మార్క్ కొట్టేస్తారని రిలీజ్‌కి ముందు అందరికీ అనిపించింది. కానీ రూ.500 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది.
(ఇదీ చదవండి: కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!)

ప్రస్తుతానికైతే నెల్సన్ దర్శకత్వంలో రజనీ.. 'జైలర్ 2' చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత కమల్ హాసన్‌తో మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. అయితే ఈ మూవీకి కూడా నెల్సన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. దీనితో పాటు సుందర్.సి దర్శకత్వంలోనూ రజనీ ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వతా రజనీ.. రిటైర్మెంట్ ఇచ్చేస్తారట. ప్రస్తుతానికి ఈ రూమర్స్‌పై అధికారిక సమాచారం లేనప్పటికీ దాదాపు ఇదే కన్ఫర్మ్ అని ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఈ రెండు సినిమాలే రజనీకాంత్ చేసేటప్పటికీ ఎలా లేదన్నా 2027 అయ్యే అవకాశముంది. అప్పుడు వయసు కూడా కాస్త మీదపడుతుంది. మరి వినిపిస్తున్నట్లు రిటైర్మెంట్ ఇచ్చేస్తారా లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: హీరోయిన్‌గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ)


