తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్ 21న) జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనూజపై కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలిచాడు. బిగ్‌బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు.
సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.

రెమ్యునరేషన్ ఎంత?
సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది బిగ్‌బాస్ టీమ్. అలా అందరిలాగే కల్యాణ్‌కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు.
రాఫ్ టైల్స్ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది.


