బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్- 5 నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రన్నర్‌గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్‌తో కనెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్‌కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్-5 వరకు చేరుకుంది.
సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిందో సంజన జర్నీ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.
సంజన రెమ్యునరేషన్
సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు టాక్. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్‌లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది.


