తల్లి చనిపోయిన విషయం దాచి షూటింగ్‌ చేశాడు.. తిరువీర్‌పై దర్శకుడు ప్రశంసలు! | The Great Pre Wedding Show Movie Trailer Release Event Highlights | Sakshi
Sakshi News home page

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: దర్శకుడు కరుణ కుమార్‌

Oct 28 2025 5:26 PM | Updated on Oct 28 2025 5:34 PM

The Great Pre Wedding Show Movie Trailer Release Event Highlights

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’(The Great Pre Wedding Show ). సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్‌ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ .. దర్శకుడు రాహుల్ కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.

అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్‌ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండిఅని చిత్ర నిర్మాత సందీప్అగరం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement