రీసెంట్ టైంలో సినీ ప్రముఖులు వ్యక్తిగత హక్కుల్ని పరిరక్షించుకోవడంలో భాగంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున ఇలా చేయగా.. ఈ మధ్యే ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టుకి వెళ్లారు. ఇప్పుడు వీళ్ల దారిలోనే పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు.
సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హక్కులని ఉల్లంఘించే విధంగా పోస్టులు పెడుతున్నారని పవన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. పవన్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ వేశారు. వారం రోజుల్లోగా ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ.. వచ్చే ఏడాది విడుదల కానుంది.


