అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్ | Farah Khan says Akshaye Khanna baldness has left him traumatized | Sakshi
Sakshi News home page

అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్

Mar 14 2026 11:54 PM | Updated on Mar 15 2026 12:32 AM

Farah Khan says Akshaye Khanna baldness has left him traumatized

బాలీవుడ్ నటుడు అక్షయ్  ఖన్నా నెగిటివ్ రోల్స్‌లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్‌గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు.  


ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు.  


'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు.  ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్‌లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్‌కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు.  

మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్‌తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  

Advertisement
 
Advertisement
Advertisement