రణ్‌వీర్ సింగ్ దురంధర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, అద్భుతమైన సౌండ్ ట్రాక్‌తో నిర్మించారని బన్నీ కొనియాడారు. మై బ్రదర్ రణ్‌వీర్ సింగ్ తన టాలెంట్‌తో మరోసారి అభిమానులను ఊపేశారని అన్నారు. దురంధర్ మూవీని ఇప్పుడే చూశానని.. ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించిందని బన్నీ ట్వీట్ చేశారు.
బన్నీ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. 'దురంధర్ మూవీ ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శనలు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్‌ట్రాక్‌లతో నిర్మించిన చిత్రమిది. మై బ్రదర్ రణ్‌వీర్ సింగ్ అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో మెప్పించారు. మొత్తంగా దురంధర్ టెక్నికల్ టీమ్, చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ మూవీ కెప్టెన్ ఆదిత్య ధార్ అద్భుతంగా తీర్చిద్దారు. నాకు ఇది చాలా నచ్చింది. దీన్ని కూడా చూసి దురంధర్‌ను ఆస్వాదించండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశారు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీని పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్ యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా ముందుకెళ్తోంది.
Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.
Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.
Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025


