
ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 నడుస్తోంది. ఈ సీజన్లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్య కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. తన మైండ్ గేమ్, స్ట్రాటజీతో ఏకంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్-9కి తొలి కెప్టెన్‌గా నిలిచింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా రాణిస్తోంది. ఈ సందర్భంగా సంజనా గల్రానీకి సంబంధించిన ఓ వీడియోను బిగ్‌బాస్ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తన జర్నీతో పాటు డ్రగ్స్ కేసు గురించి కూడా సంజనా మాట్లాడింది. తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ఎమోషనలైంది.
ఈ వీడియోలో సంజనా మాట్లాడుతూ.. 'హాయ్ నా పేరు అర్చన.. నేను మీ బుజ్జిగాడు సంజనా అంటూ పరిచయం చేసుకుంది. ఏడో తరగతిలోనే ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టాను. జాన్ అబ్రహంతో చేసిన యాడ్ చూసి పూరి జగన్నాధ్ నాకు బుజ్జిగాడులో అవకాశం ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నా. ఒకరోజు సడన్‌గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? ఆ రోజు డిసైడ్ అయిపోయా. ఆ రోజు గురించి తలుచుకుంటేనే చాలా బాధేస్తోంది. ఒక్కొక్కరు వారికి నచ్చినట్లు రాసుకున్నారుని ఆవేదన వ్యక్తం చేసింది.
అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్‌చిట్ ఇచ్చింది. కానీ ఆ క్లీన్ చీట్ ఎవరికీ కనిపించలేదు. చూసేవారికి బిగ్‌బాస్ కేవలం ఓ ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కావొచ్చు. కానీ నా లైఫ్లో ఈ బిగ్‌బాస్ షో నాకు పెద్ద ఛాన్స్. మీ మనసుల్లో నాకు గురించి ఎంత తప్పుగా అనుకున్నారో.. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. ఈ షో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. కానీ మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్‌బాస్‌కు వచ్చాను" అంటూ ఫుల్ ఎమోషనలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా.. 1989లో అక్టోబర్ 10న బెంగళూరులో స్థిరపడిన సింధి కుటుంబంలో జన్మించారు సంజన గల్రానీ. టాలీవుడ్ చిత్రపరిశ్రమతోనే తొలి ఛాన్స్ అందుకున్నారు. 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సొగ్గాడులో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో ఒరు కధల్ సేవిర్‌లో నటించారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రంతో సంజన గల్రానీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.
కాగా.. శాండిల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజనా గల్రానీ పేరు తైరపైకి వచ్చింది. విచారణకు పిలిచిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఆమెను జైల్లోనే ఉంచారు.
Cleared the blame, now she’s in the game, #SanjanaGalrani is here to claim the fame ❤️🔥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/ZjX4leeZAN— Starmaa (@StarMaa) October 7, 2025