తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్‌ల పోటీలకు ఎంపికైంది. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఈ మూవీ పోటీ పడనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ సిమ్రాన్ మెరిసింది. కాగా.. ఈ నెల 22న ఆస్కార్ చిత్రాల తుది జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించనుంది.
అయితే ఈ ఏడాది ఆస్కార్ బరిలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన రెండు చిత్రాలు పోటీపడనున్నాయి. ఆస్కార్ అవార్డుల రేసులో కాంతార: చాప్టర్-1 , మహావతార్ నరసింహ చిత్రాలు జనరల్ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్‌తో పాటు నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి కేటగిరీల్లోనూ పోటీపడనున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హోంబలే ఫిల్మ్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ఆస్కార్ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన సినిమాలను ఎంపిక చేయనున్నారు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఆస్కార్‌కు భారత్ నుంచి ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. టూరిస్ట్ ఫ్యామిలీతో పాటు తన్వీ ది గ్రేట్, సిస్టర్ మిడ్‌నైట్ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి.
A moment of immense pride for Tamil cinema ❤️✨#TouristFamily steps onto the global stage, officially eligible and in contention for the Best Picture category at the Academy Awards (Oscars).
Written & directed by @abishanjeevinth ✨
A @RSeanRoldan musical 🎶 @SasikumarDir… pic.twitter.com/Hpe8AKppSd— Million Dollar Studios (@MillionOffl) January 9, 2026


