– రామ్ అబ్బరాజు
‘‘చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది డైరెక్టర్‌గా తొలిసారి సంక్రాంతికి నా సినిమా రావడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అని రామ్ అబ్బరాజు చెప్పారు. శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా రామ్ అబ్బరాజు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘శర్వానంద్‌గారి ‘బైకర్’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడటంతో మాకు సంక్రాంతికి వచ్చే చాన్స్ దొరికింది. నేను తీసిన ‘వివాహ భోజనంబు, సామజవరగమన’ లానే ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ‘రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు..’ వంటి వినోదాత్మక చిత్రాల తర్వాత శర్వానంద్‌గారు చేసిన ఎంటర్‌టైనర్ మూవీ ఇది.
ఈ చిత్రంలో మంచి అతిథి పాత్ర ఉంది.. శ్రీవిష్ణుగారిని అడిగిన వెంటనే చేశారు. నా తర్వాతి సినిమాని శ్రీవిష్ణుగారితో క్రైమ్ కామెడీ జోనర్‌లో చేస్తున్నాను. నా ప్రతి సినిమాకి భాను, నందు రైటర్స్‌గా ఉన్నారు. ఇకపైనా ఇలానే కొనసాగుతుంది. ఇండస్ట్రీలో రచయితల కొరత ఉందనేది వాస్తవమే. చాలామంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వస్తారు. కాక΄ోతే కొందరు రైటర్‌గా కొన్నాళ్లు చేసి, ఆ తర్వాత డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తారు. నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే వచ్చాను. గుణశేఖర్‌గారి ‘నిప్పు’ సినిమాకి పని చేశాను’’ అని చెప్పారు.


