సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్‌ | Actor Rajendra Prasad Refuses To Give Selfie To Fan Sparks Debate, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిపై నటుడి అసహనం.. వీడియో వైరల్‌

Mar 7 2026 12:14 PM | Updated on Mar 7 2026 12:24 PM

Actor Rajendra Prasad Refuses to Give Selfie, Video Goes Viral

సెలబ్రిటీలన్నాక కూసింత ఓర్పు, సహనం ఉండాలి. అందులోనూ నలుగురిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు శాంతంగా ఉండాలి, చిరునవ్వుతోనే కనిపించాలి. అభిమానంతో ఎవరైనా సెల్ఫీ అడిగినప్పుడు కుదిరితే ఇవ్వాలి.. లేదంటే వినమ్రంగా తిరస్కరించాలి. కానీ, అసహనం ప్రదర్శించారంటే మాత్రం ఇదిగో ఇలా రాజేంద్రప్రసాద్‌లా విమర్శలపాలు కావాల్సి వస్తుంది.

సెల్ఫీ అడిగితే..
అసలే కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్నాడు నటుడు రాజేంద్రప్రసాద్‌. తాజాగా ఈయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ కుర్రవాడు రాజేంద్రప్రసాద్‌ను చూసి ఆతృతతో సెల్ఫీ అడిగాడు. కానీ, ఆయన ఆ పిల్లాడిని అసహనంతో పక్కకు తోసేసి హడావుడిగా ముందుకు వెళ్లిపోయాడు. 

వీడియో వైరల్‌
ఆ సమయంలో రాజేంద్రప్రసాద్‌ ముఖకవళికలు ఆ పిల్లాడిని చీదరించుకున్నట్లుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఎందుకింత పొగరు చూపిస్తున్నాడు. ఒక్క సెల్ఫీ ఇస్తే ఏమవుతుంది? అసలు ఇలాంటి వాళ్లకు అటెన్షన్‌ ఇవ్వడం మానేయాలి అని విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం.. ఆయనేదో బిజీలో ఉన్నట్లున్నారు, వదిలేయండి అని సమర్థిస్తున్నారు.

 

 

చదవండి: భార్యాభర్తలిద్దరూ పని చేస్తామంటే కుదరదు: కరీనా కపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement