భార్యాభర్తలిద్దరం పని చేస్తామంటే కుదరదు: కరీనా | Kareena Kapoor Reveals Strategy About Balancing Motherhood And Career, Says Can Not Leave Kids Alone, Understanding Husband Is Essential | Sakshi
Sakshi News home page

పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేం.. నా భర్త చూసుకున్నాడు గనకే..!

Mar 7 2026 11:41 AM | Updated on Mar 7 2026 11:58 AM

Kareena Kapoor: Can not leave kids Alone, understanding Husband is Essential

రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని వాదించి వార్తల్లోకెక్కింది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె. తల్లయ్యాక అటు కెరీర్‌ను, ఇటు పిల్లల బాధ్యతను చూసుకోవడం కష్టమైన పని అని.. కొత్తగా తల్లయిన వారికి అందరూ మద్దతుగా నిలవాలని కోరింది. ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు అన్ని సినిమాలకు అది వర్కవుట్‌ కాదని విమర్శించారు. 

తల్లయ్యాక ఎలా?
అటు దీపికా... పనిగంటలతో పాటు ఇతరత్రా డిమాండ్స్‌ కారణంగా కల్కి 2898 ఏడీ సీక్వెల్‌, స్పిరిట్‌ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తల్లయ్యాక సినిమాలు ఎలా మేనేజ్‌ చేస్తున్నారన్న ప్రశ్నపై బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ద బకింగ్‌హామ్‌ మర్డర్స్‌ మూవీ షూట్‌ కోసం లండన్‌లో 35 రోజులు ఉండాల్సి వచ్చింది. 

ముందుగానే ప్లాన్‌
ఎప్పుడు వెళ్లాలి? మళ్లీ ఎప్పుడు తిరిగి రావాలి? అనేది ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాను. అన్నీ ముందుగానే ప్లాన్‌ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులు షూటింగ్‌ అయ్యాక మధ్యలో ఇండియా తిరిగొచ్చాను. పిల్లలతో గడిపాను. ఆ సమయంలో మిగతావారిపై చిత్రీకరణ జరిపారు. నేను తిరిగి వెళ్లగానే నా పాత్ర షూటింగ్‌ పూర్తిచేశారు. 

నేను అదృష్టవంతురాలిని
చిత్రయూనిట్‌ నన్ను అర్థం చేసుకుని సహకరించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పైగా ఆ సమయంలో సైఫ్‌ ఇంట్లో పిల్లలతోనే ఉన్నాడు. మేమిద్దరం పని కోసం పరిగెడుతూ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేము. ఒకరు పని చేస్తున్నప్పుడు మరొకరు ఇంటిపట్టున ఉండి పిల్లల్ని చూసుకోవాలి. అలా అర్థం చేసుకునే భాగస్వామి ఉండాలి అని కరీనా కపూర్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేటు నిండా చిప్స్‌.. అంతా ఒక్కడే తింటాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement