కరీనా కపూర్‌లా చూపిస్తానన్నాడు.. అందుకే బికినీ ధరించా! | Actress Priyamani about Bikini Suit in Drona Movie | Sakshi
Sakshi News home page

Priyamani: తొలిసారి బికినీ వేశా.. ఇప్పుడు అడిగి ఉంటే మాత్రం..

Mar 6 2026 7:49 PM | Updated on Mar 6 2026 8:08 PM

Actress Priyamani about Bikini Suit in Drona Movie

హీరోయిన్‌ ప్రియమణి సినీ జర్నీ తెలుగు సినిమాతోనే మొదలైంది. ఎవరే అతగాడు (2003) మూవీతో కథానాయికగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. తాజాగా సరస్వతి సినిమాతో పలకరించింది.

డైరెక్టర్‌ అడగడంతో..
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ప్రియమణి. ఈ సందర్భంగా కెరీర్‌ తొలినాళ్లలో బికినీ ధరించిన ఘటన గురించి గుర్తు చేసుకుంది. ప్రియమణి మాట్లాడుతూ.. స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గరకు చీర కట్టుకుని వెళ్లం కదా.. ఏది కంఫర్ట్‌గా ఉంటే ఆ దుస్తులే ధరిస్తాం. ద్రోణ సినిమాలో స్విమ్‌ సూట్‌ వేసుకోమని డైరెక్టర్‌ అడిగాడు. 

కరీనా కపూర్‌లా..
టషన్‌ మూవీలో కరీనా కపూర్‌లా నిన్ను డిఫరెంట్‌గా చూపించాలనుకుంటున్నా అన్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడూ స్విమ్‌సూట్‌ వేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం అని ఓకే చెప్పాను. ఆ తర్వాత చాలా కామెంట్స్‌ వచ్చాయి. ట్రోలింగ్స్‌ జరిగాయి. నటిగా ఉన్నప్పుడు పరిస్థితి డిమాండ్‌ చేస్తే అలాంటి డ్రెస్‌ వేసుకోక తప్పదు. కానీ మన సౌకర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు అడిగితే మాత్రం నేను కచ్చితంగా చేయనని చెప్పేస్తాను అని ప్రియమణి పేర్కొంది.

చదవండి: ఇది కరెక్ట్‌ కాదు.. విజయ్‌పై నటి ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement