రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేటు నిండా చిప్స్‌, బిస్కెట్స్‌, చాక్లెట్స్‌.. | Srinath Maganti says Ranbir Kapoor comes with Plate full of Snacks for Co Stars | Sakshi
Sakshi News home page

Srinath Maganti: రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేటులో చిప్స్‌ తిన్నందుకు ఓసారి..

Mar 7 2026 10:10 AM | Updated on Mar 7 2026 10:22 AM

Srinath Maganti says Ranbir Kapoor comes with Plate full of Snacks for Co Stars

మూడేళ్ల క్రితం వచ్చిన యానిమల్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాసిందో అందరం చూశాం. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌ రష్మిక మందన్నా సోదరుడిగా నటించాడు శ్రీనాథ్‌ మాగంటి.

మర్చిపోలేని అనుభవం
ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించాడు. యానిమల్‌ సినిమాలో నటించడం అస్సలు మర్చిపోలేను. రణ్‌బీర్‌ తాత రాజ్‌కపూర్‌ పెద్ద స్టార్‌, తండ్రి రిషి కపూర్‌ గొప్ప స్టార్‌,.. రణ్‌బీర్‌ కూడా స్టార్‌ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన అంకిత భావంతో పని చేస్తాడు. సెట్‌కు భారీ సిబ్బందిని వెంటేసుకుని రాడు. 

ఒక ప్లేటు నిండా చాక్లెట్స్‌, చిప్స్‌
తను వచ్చినప్పుడల్లా ప్లేటు నిండా ఆరోగ్యకరమైన చిప్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు వెంటపట్టుకుని వస్తాడు. అవన్నీ కేవలం తనకోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం కూడా! ఎవరికి ఆకలైతే వారు తీసుకుని తినవచ్చు. కసారి నేను ఆ ప్లేటులోని స్నాక్‌ తీసుకుని తిన్నాను. ఇంతలో ఓ వ్యక్తి అది సార్‌ది అన్నాడు. సర్‌, ఈ ప్లేటంతా తింటాడా? అని అడిగాను. మా మాటలు విన్న రణ్‌బీర్‌.. నన్ను వారించిన వ్యక్తిని మూర్ఖుడా.. అతడిని తిననివ్వు అని చెప్పాడు.

సినిమా
అతడిని ఏదో కోపంతో తిట్టలేదు, ప్రేమ, చనువుతోనే అతడిని వారించి నన్ను తినమమన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రణ్‌బీర్‌ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. దీని తర్వాత యానిమల్‌కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న యానిమల్‌ పార్క్‌లో భాగం కానున్నాడు.

చదవండి: ఆస్కార్‌ నుంచి ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement