Srinath Maganti
-
రణ్‌బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్..
మూడేళ్ల క్రితం వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాసిందో అందరం చూశాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా సోదరుడిగా నటించాడు శ్రీనాథ్ మాగంటి.మర్చిపోలేని అనుభవంఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించాడు. యానిమల్ సినిమాలో నటించడం అస్సలు మర్చిపోలేను. రణ్‌బీర్ తాత రాజ్‌కపూర్ పెద్ద స్టార్, తండ్రి రిషి కపూర్ గొప్ప స్టార్,.. రణ్‌బీర్ కూడా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన అంకిత భావంతో పని చేస్తాడు. సెట్‌కు భారీ సిబ్బందిని వెంటేసుకుని రాడు. ఒక ప్లేటు నిండా చాక్లెట్స్, చిప్స్తను వచ్చినప్పుడల్లా ప్లేటు నిండా ఆరోగ్యకరమైన చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వెంటపట్టుకుని వస్తాడు. అవన్నీ కేవలం తనకోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం కూడా! ఎవరికి ఆకలైతే వారు తీసుకుని తినవచ్చు. కసారి నేను ఆ ప్లేటులోని స్నాక్ తీసుకుని తిన్నాను. ఇంతలో ఓ వ్యక్తి అది సార్‌ది అన్నాడు. సర్, ఈ ప్లేటంతా తింటాడా? అని అడిగాను. మా మాటలు విన్న రణ్‌బీర్.. నన్ను వారించిన వ్యక్తిని మూర్ఖుడా.. అతడిని తిననివ్వు అని చెప్పాడు.సినిమాఅతడిని ఏదో కోపంతో తిట్టలేదు, ప్రేమ, చనువుతోనే అతడిని వారించి నన్ను తినమమన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రణ్‌బీర్ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. దీని తర్వాత యానిమల్కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్‌లో భాగం కానున్నాడు.చదవండి: ఆస్కార్ నుంచి ఆహ్వానం -
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాంకథేంటంటే..మల్లేష్(శ్రీనాథ్ మాగంటి) చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉంటుంది. దానికి కారణం వాళ్ల నాన్న. నాన్న తాగొచ్చ అతన్ని కొట్టడంతో.. ఓ రోజు మల్లేష్ కూడా మద్యం సేవించి నాన్నని కొట్టి పారిపోతాడు. కొన్నాళ్ల తర్వాత నాన్న చనిపోయిన విషయం తెలిసి తిరిగి వస్తాడు. ఊర్లోనే టెంట్ హౌస్ పెట్టి.. వచ్చిన డబ్బులతో తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అతని మేనమామ కొడుకు చిన్న పటేల్(రాజేష్)తో మల్లేష్ ఫ్యామిలీకి గొడవలు ఉంటాయి. తల్లి బలవంతం చేయడంతో జ్యోతి(గాయత్రీ రమణ)ని మల్లేష్ పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజే అతనికి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? దాని వల్ల మల్లేష్‌కి వచ్చిన సమస్యలు ఏంటి? చిన్న పటేల్‌తో మల్లేష్ చేసిన ఛాలెంజ్ ఏంటి? జ్యోతి-మల్లేష్‌ల సంసారం ఎలా సాగింది? మందు లేనిదే ఏ పని చేయలేని మల్లేష్...చివరకు మద్యానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ కథలో కామాక్షి భాస్కర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ అడల్ట్ కామెడీ చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సింపులే అయినా.. దాని చుట్టు అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. అడల్ట్ కామెడీ అయినా.. అందులోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దారితప్పిన వ్యక్తిని తల్లి, భార్య ఎలా దారికి తీసుకొచ్చారు అనేది చూపిస్తూనే మద్యానికి బానిసైతే ‘సంసార’ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి.మల్లేష్‌కు చిన్నప్పుడే తాగుడు అలవాటు ఎలా వచ్చింది అనే సన్నివేశాలతో కథను ప్రారంభించాడు దర్శకుడు. మొదటి పది నిమిషాలు రొటీన్‌గానే సాగిపోతుంది. మల్లేష్, జ్యోతిల పెళ్లి తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. కానీ ‘కార్యం’ మాత్రం కాదు. ఆ విషయం దాచేందుకు హీరో చేసే ప్రయత్నాలన్నీ నవ్వులు పూయిస్తాయి. మల్లేష్‌కి ‘కార్యం’ కాలేదనే విషయం చిన్నపటేల్‌కి తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు ఇద్దరు చేసుకునే సవాల్.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థం ప్రారంభంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఛాలెంజ్ గెలవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు.. దాన్ని తిప్పికొట్టేందుకు చిన్న పటేల్ చేసే కుట్రలు అన్ని రొటీన్‌గానే ఉంటాయి. తల్లి చనిపోయే సీన్ కూడా అనవసరమే అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో కామాక్షీ సీన్ అదిరిపోతుంది. అయితే ఆ తర్వాత ఆమె పాత్రను అంతే బలంగా చూపిస్తే బాగుండేది. కానీ దర్శకుడు మాత్రం భార్య భర్తల అనుబంధంపైనే ఫోకస్ చేశాడు. అవి ఆకట్టుకుంటాయి. అలాగే కార్యం సమయంలో పక్కింట్లోని ముసలాయన రేడియోలో వినే పాత పాటల సీన్లన్నీ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. రేడియో సీన్ రిపీట్ అయిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతాడు. కానీ కార్యం సీన్‌తో పాటు కొన్ని బూతు డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన శ్రీనాథ్.. ఇందులో ఊరమాస్ లుక్‌లో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్గా నటించిన గాయత్రి రమణ..తెరపై పక్కింటి తెలుగు అమ్మాయిలా కనిపించడమే కాకుండా నటన పరంగానూ మెప్పించింది. కామాక్షి భాస్కర్ల పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు కానీ.. ఒక్క సీన్లో మాత్రం అదరగొట్టేసింది. పటేల్‌గా రాజేశ్ బాగానే నటించాడు. మురళీ ధర్, రాజ్ కుమార్ కసిరెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సురేశ్ బొబ్బిలి నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టే, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నేను పక్కా తెలుగు యాక్టర్‌ని : శ్రీనాథ్ మాగంటి
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఇందులో గాయత్రీ రమణ, సాయి కామాక్షీ భాస్కర్ల హీరోయిన్లుగా నటించారు. రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనాథ్ మాగంటి మాట్లాడతూ– ‘‘ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నప్పటికీ సబ్జెక్ట్ యూనివర్సల్. దారి తప్పిన మల్లేష్ (హీరో పాత్ర) అనే పొగరుబోతుని అతని తల్లి, భార్య కలిసి ఎలా దారిలోకి తీసుకొస్తారన్నదే ఈ సినిమా కథ. ఈ విషయాన్నే సరదాగా చెప్పా. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకునే సినిమా ఇది. సతీష్‌గారు మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. నిర్మాత రాజేష్‌గారు ఈ సినిమాలో నటించడంతోపాటు కొన్ని డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో నటించిన హరి హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయారు. అయితే తన పాత్ర చిత్రీకరణ అప్పటికే పూర్తయింది. ఈ సినిమా రూపంలో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. ఇక ఈ సినిమాతో యాక్టర్‌గా నన్ను నేను కొత్తగా స్క్రీన్‌పై చూపించుకోవడానికి ఒక చాన్స్ లభించింది. అందుకే మల్లేష్ క్యారెక్టర్ కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను. ‘హిట్, యానిమల్, లక్కీభాస్కర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించాను. కానీ కొందరు ప్రేక్షకులు నన్ను పరభాషా నటుణ్ణి అనుకుంటున్నారు. నేను పక్కా తెలుగు యాక్టర్‌ని. ఈ సినిమాతోనైనా తెలుగు ప్రేక్షకులు నా పేరు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సందీప్ రెడ్డి వంగాగారు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. మా సినిమాను థియేటర్స్‌లో చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రంలో నటిస్తున్నాను. సోలో హీరోగా కొన్ని కథలు వింటున్నాను’’ అని తెలిపారు. -
ఆ సినిమాలో ఛాన్స్.. వెరైటీ బూతులతో నన్ను తిట్టారు
తెలుగులో సర్ప్రైజ్ హిట్స్ అయిన సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది?' ఒకటి. తరుణ్ భాస్కర్ తీసిన ఈ చిత్రం నలుగురు స్నేహితులు, వాళ్ల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీశారు. ఇప్పటికే చాలామంది యూత్‌కి ఇది ఫేవరెట్ మూవీ. ప్రస్తుతం దీని సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇందులోని లీడ్ రోల్స్‌లో ఒకడైన సుశాంత్ తప్పుకోవడం శ్రీనాథ్ మాగంటికి అవకాశమొచ్చింది. అయితే ఈ విషయం బయటకు రాగానే తనని వెరైటీ వెరైటీ బూతులతో దారుణంగా తిట్టారని శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి)''ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్లో నన్ను తీసుకున్నారని అనగానే.. మెసేజులు కొన్ని వచ్చాయి. అసలు ఇట్లా తిడతారేందిరా మీరు. క్యారెక్టర్లు చేసుకుంటున్నావ్ పోయి అది చేసుకో. వెరైటీ వెరైటీ బూతులతో నన్ను తిట్టారు. దీంతో ఎదుటి మనిషి అవకాశాన్ని పాలిటిక్స్ వాడి గుంజేసుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. నాకు అవకాశమొచ్చింది. ఇది నేను మీకు ఎలారా చెప్పాలి అని అనుకున్నా' అని శ్రీనాథ్ మాగంటి చెప్పుకొచ్చాడు.మరో ఆరు రోజులు షూటింగ్ చేస్తే ఫస్టాఫ్ పూర్తయిపోతుందని చెప్పిన శ్రీనాథ్.. అసలు సెట్లో పనిచేస్తున్నామా పార్టీ చేసుకుంటున్నామా అర్థం కాదని కూడా అన్నాడు. అలా ఫ్లోలో వెళ్లిపోతూ ఉంటుంది బండి, అంత సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. హీరోగానే కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. హిట్, యానిమల్, లక్కీ భాస్కర్ తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన 'మెన్షన్ హౌస్ మల్లేష్' మూవీ.. ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగానే ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఈ నగరానికి ఏమైంది 2' సంగతులు చెప్పాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా) -
రష్మిక రీల్ బ్రదర్ హీరోగా సినిమా.. ట్రైలర్ రిలీజ్
హిట్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీనాథ్ మాగంటి.. 'యానిమల్' మూవీలో రష్మికకు సోదరుడిగానూ యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. అదే 'మెన్షన్ హౌస్ మల్లేష్'. మార్చి 06న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా తాజాగా సందీప్ రెడ్డి వంగా చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అలరించేలా ఉంది.(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)తెలంగాణలోని ఓ ఊరిలో మల్లేష్ అనే కుర్రాడు. మందు తాగుతూ అవారాగా తిరుగుతుంటాడు. మారుతాడనుకుని ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. మల్లేష్‌కి అతడి భార్యతో ఎలాంటి బంధం ఏర్పడింది అనేదే స్టోరీలా అనిపించింది. ట్రైలర్లోనే మూవీ ప్లాట్ ఏంటనేది దాదాపుగా బయటపెట్టేశారు. చూడాలి మరి థియేటర్లలో ఎలాంటి టాక్ అందుకుంటుందో?(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
'మెన్షన్ హౌస్ మల్లేష్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
యూట్యూబ్‌లో అలరిస్తున్న 'మెన్షన్ హౌస్ మల్లేష్' సాంగ్
హిట్, యానిమల్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి. ఇతడి హీరోగా చేసిన సినిమా 'మెన్షన్ హౌస్ మల్లేష్'. కొన్నాళ్ల క్రితం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చాయి. థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమాలోని పాట యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.'బంగారి బంగారి' అంటూ సాగే పాట కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేయగా శ్రోతల్ని అలరిస్తూ ఇప్పుడు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో గాయత్రి రమణ హీరోయిన్గా చేస్తోంది. బాల సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతమందించారు. రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. -
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు
‘‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. ‘1 నేనొక్కడినే, 100%లవ్’ చిత్రాలకు కథ అందించిన హరి ప్రసాద్ ఈ సినిమాకు స్టోరీ అందించారంటే కథ ఎలా ఉంటుందో తెలుస్తోంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్ విడుదల చేశారు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘మంచి సందేశం ఉన్న కథతో తీశాం. డబ్బు వస్తుందా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశాననే సంతృప్తి ఉంది’’ అన్నారు. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని మా సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.కిషోర్, కెమెరా: సునీల్ కుమార్.ఎ¯Œ . -
తెలంగాణ నేపథ్యంలో...
‘‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’ ఫస్ట్‌లుక్ చాలా కొత్తగా ఉంది. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటుందనుకుంటున్నా’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. శ్రీనాథ్ మాగంటి, మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్‌స్టేషన్’. ‘జగ్గిలొల్లి’ అన్నది ఉపశీర్షిక. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇదొక వినూత్న ప్రయత్నం. మా టీమ్‌ని శేఖర్ కమ్ములగారు అభినందించడం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉంటాయి. గాయకుడు గోరటి వెంకన్న ప్రధాన పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు నాగసాయి. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్. -
హర్రర్ కామెడీగా 'ఇదేం దెయ్యం'
ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయానంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్. సరిత నిర్మిస్తోన్న చిత్రం 'ఇదేం దెయ్యం'. శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు. సాక్షి కక్కర్ , రచన స్మిత్, రుచి పాండే నాయికలు. రచ్చ రవి, కిరాక్ ఆర్.పి కీలక పాత్రధారులు. వి. రవివర్మ దర్శకత్వం వహించగా, బాలు స్వామి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ సీడీలను ఆవిష్కరించి యూనిట్ సభ్యులకు అందజేశారు. ఇటీవల వెండితెర మీద సక్సెస్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న హర్రర్ కామెడీ జానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్, తుమ్మలపల్లి రామసత్యానారాయణ, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


