ట్రెడిషనల్‌ డిజైనర్‌వేర్‌లో రిషబ్‌ సెట్టి స్టన్నింగ్‌ లుక్‌..! | Fashion: Rishab Shettys IIFM Look: Black Kurta With Gandaberunda Motif | Sakshi
Sakshi News home page

Rishab Shetty: ట్రెడిషనల్‌ డిజైనర్‌వేర్‌లో రిషబ్‌ సెట్టి స్టన్నింగ్‌ లుక్‌..! స్వయంగా ఆయన భార్య..

Aug 18 2026 10:58 AM | Updated on Aug 18 2026 11:02 AM

Fashion: Rishab Shettys IIFM Look: Black Kurta With Gandaberunda Motif

17వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IIFM) 2026లో, రిషబ్ శెట్టి తన విజయాల జాబితాలో మరో రెండు కొత్త గౌరవాలను చేర్చుకున్నారు. ఈ కన్నడ నటుడు, చిత్ర నిర్మాత కాంతార చాప్టర్‌1కి ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలచుకోవడం తోపాటు లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ అవార్డులు తోపాటు అంతర్జాతీయ వేదికపై ఆయన కనిపించిన తీరు అందరిని ఆకర్షించింది. 

ఆడంబరమైన ట్రెండీ ఫ్యాషన్‌ దుస్తులను ఎంచుకోకుండా తన కర్ణాటక మూలాలకు దగ్గరగా ఉండే సాంప్రదాయ లుక్‌లో అలరించారు. ఈ కాంతార చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైర్‌గా పనిచేసిన ఆయన భార్య ప్రగతిశెట్టి ఆయన కోసం ఒక నల్ల కుర్తాను డిజైన్‌ చేశారు. అంతేగాదు దానికి మ్యాచింగ్‌గా చేనేత పట్టు ధోతిని ఎంచుకున్నారామె. ఈ ఐవరీ ధోతికి జరీ అంచు ఉండగా, కుర్తాలో అత్యంత ప్రత్యేక భాగం గండబేరుండా ఎంబ్రాయిడరీ. ఇది ఆ దుస్తులకు ప్రత్యేక రూపాన్ని ఇచ్చింది. 

కర్ణాటక వారసత్వాన్ని ప్రదర్శించేలా..
ఈ మేరకు రిషబ్‌ శెట్టి భార్య ప్రగతి మాట్లాడుతూ..ప్రామాణికమైన క్లాసిక్‌ రూపాన్ని ఇచ్చేందుకు సాంప్రదాయ ధోతి, కుర్తాను ఎంచుకున్నామని అన్నారు. ధోతి కోసం స్వచ్ఛమైన పట్టుని ఎంచుకున్నామని, అలాగే అందులో ఉండే అంచు ఆడంబరంగా కాకుండా పండుగ శోభను అందించిందన్నారు. 

కుర్తా కోసం చేనేత నల్ల పట్టు వస్త్రాన్ని ఎంచుకున్నామని చెప్పారు. సౌకర్యవంతంగా శుద్ధమైన ఆకృతిని కలిగి ఉంటుందన్నారు. దీంతోపాటు కర్షాటకపట్ట కృతజ్ఞాత గర్వాన్ని వ్యక్తం చేసేందుకు తమ రాష్ట్రానికి శక్తిమంతమైన ప్రతిష్టాత్మక చిహ్నమైన గండబేరుండ ఎంబ్రాయిడరీని పొందుపరిచామని అన్నారు.

గండబేరుండ అంటే..
ఇది రెండు తలల ఒక పౌరాణిక పక్షి. ఇది బలం ధైర్యం, శక్తి, దృఢత్వానికి ప్రతీక. కర్ణాటకలో దీనికి లోతైన సాంస్కృతిక చారిత్ర ప్రాముఖ్యత ఉంది. ఇది రాష్ట్ర వారసత్వంతో ద్గరి సంబంధ కలిగి ఉంది అని చెప్పుకొచ్చారామె.

(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement