ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య రాయ్‌ స్టైలిష్‌ లుక్‌..హ్యాండ్‌ బ్యాగ్‌ అంత ఖరీదా..! | Aishwarya Rai arrived at the airport carrying luxury bag worth Rs 6 Lakh | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య రాయ్‌ స్టైలిష్‌ లుక్‌..హ్యాండ్‌ బ్యాగ్‌ అంత ఖరీదా..!

Sep 29 2026 4:17 PM | Updated on Sep 29 2026 4:27 PM

Aishwarya Rai arrived at the airport carrying luxury bag worth Rs 6 Lakh

బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌  బచ్చన్‌ పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా జరిగిన లోరియల్‌ పారిస్‌ 'ఎక్స్‌ప్రెస్ యువర్ వర్త్' షోకు హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో మొత్త నలుపు రంగు లుక్‌తో ఆశ్చర్యపర్చింది. దీనికి ముందు పారిస్‌కు వెళ్తుండగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్టన్నింగ్‌ స్టైలిష్‌ లుక్‌లో అభిమానులను అలరించింది. అక్కడ ప్రధానంగా ఆకర్షించింది ఆమె బ్యాగ్‌. ఆమె  లోరియల్ పారిస్ రన్‌వే షో కోసం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తుండగా ఈ హ్యాంగ్‌బ్యాగ్‌తో కనిపించి ఈ అందాల రాణి. 

ఆమె ఫౌండెంట్‌ షేడ్‌లో ఉన్న బ్రాండ్‌ ఆండియామో లార్జ్ టాప్ హ్యాండిల్ బ్యాగ్‌ను తీసుకువెళ్లారు. ఈ లగ్జరీ బొట్టెగా వెనెటా బ్యాగ్‌ ఐశ్వర్య ఎయిర్‌పోర్ట్‌ లుక్‌ని మరింత కట్టిపడేసేలా చేసింది. దీని ధర తెలిస్తే కంగుతినడం ఖాయం. అక్షరాల రూ. 6.5 లక్షలు. ఈ తొమ్మిదవ పారిష్‌ ఎడిషన్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్‌ పారిస్‌ అంబాసిడర్లు, సెలబ్రిటీలను ఒక చోట చేర్చింది. 

ఐశ్వర్యతో పాటు సిమోన్ యాష్లే, మేరీ బోచెట్, వియోలా డేవిస్, కారా డెలివింగ్నే, జేన్ ఫోండా, బేబ్ వియో గ్రాండిస్, లుమా గ్రోత్, కెండల్ జెన్నర్, అజా నవోమి కింగ్, ఇవా లాంగోరియా, ఆండీ మెక్‌డొవెల్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో ఐశ్వర్య త్రీడీ ప్రింజ్‌ ఎంబ్రాయిడరీతో కూడిన టూ-పీస్ బ్లాక్ వెల్వెట్ గౌన్‌ను ఎంచుకున్నారు. ఈ ప్యారిస్‌ షోలో ఐశ్వర్య హెయిర్‌ తొలిసారిగా మండుతున్న ఎరుపులో కనిపించడం విశేషం. .  

 

ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement