ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో బురిడీ, నెలకు రూ. 2.80 లక్షలు..కట్‌ చేస్తే | Fake CV Lands Man Vice President Role With Rs 3 Lakh Salary In Gwalior | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో బురిడీ, నెలకు రూ. 2.80 లక్షలు..కట్‌ చేస్తే

Sep 29 2026 3:34 PM | Updated on Sep 29 2026 3:37 PM

Fake CV Lands Man Vice President Role With Rs 3 Lakh Salary In Gwalior

మధ్యప్రదేశ్‌లోని ఒకఆటోమొబైల్ కంపెనీలో నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించి సీనియర్ ఉద్యోగం సంపాదించిన దేవేంద్ర కుమార్‌ దూబే వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేక్‌ సర్టిఫికెట్లు ఆధారంగా సంపాదించిన ఈ ఉద్యోగం ద్వారా నెలవారీ జీతం  ఏకంగా  రూ. 2.80 లక్షలు అందుకున్నాడు.   కట్‌ చేస్తే..

పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం కాన్పూర్‌కు చెందిన రామరైష్ కుమార్ దూబే కుమారుడైన దేవేంద్ర కుమార్ దూబేపై కేసు నమోదైంది. ఆ నకిలీ పత్రాలు ఎలా తయారయ్యాయి, అతనికి ఉద్యోగం ఎలా వచ్చింది అనే వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగుతోందని క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ శర్మ తెలిపారు. 

గ్వాలియర్‌లోని 'శ్రీతుల్జా భవాని ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్' (Shritulja Bhavani Automobile Private Limited) కంపెనీలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకోసం నకిలీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్స్‌ సంపాదించాడు దేవేంద్ర కుమార్‌, 'ల్యాండ్‌మార్క్ గ్రూప్' (Landmark Group) అనే మరో సంస్థలో గతంలో పని చేసినట్లు ఫోర్జరీ పత్రాలను సమర్పించాడు. అవన్నీ ఒరిజినల్‌ అని నమ్మిన కంపెనీ నెలకు రూ. 2,80,670 జీతం చెల్లించింది. కానీ కొంతకాలం తర్వాత అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో కంపెనీ అంతర్గత విచారణ జరిపడంతో అతని గుట్టు రట్టయింది.  అతను సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. దీంతో కంపెనీ  గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో అతను అక్కడ్నించి పరారయ్యాడు.

ఇదీ చదవండి: విషాదం : భార్య టార్చర్‌, అత్తమామలు అల్లుణ్ని కాల్చి చంపేశారు

కాన్పూర్‌లో అరెస్ట్
ఈ కేసు నమోదైన తర్వాత క్రైమ్ బ్రాంచ్ బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం నాడు కాన్పూర్‌లో పోలీసులు దాడులు నిర్వహించి దేవేంద్రను అరెస్టు చేశారు. ఈ ఫోర్జరీ  ఉద్యోగ మోసానికి సంబంధించిన కేసులో మరింత విచారించేందుకు పోలీసులు అతన్ని గ్వాలియర్‌కు తరలిస్తున్నారు. ఆ కంపెనీతో ఎలాంటి పని అనుభవం లేనప్పటికీ, దేవేంద్ర మూడు నకిలీ అనుభవ సర్టిఫికెట్ల , ఇతర పత్రాలను ఎలా సంపాదించడనే దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు.

ఇదీ చదవండి: రూ. 336 కోట్ల స్కామ్‌ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement