తిరుపతిలో ఘోర ప్రమాదం | Tirupati Crane Accident Four Dead | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఘోర ప్రమాదం

Sep 29 2026 2:19 PM | Updated on Sep 29 2026 2:42 PM

Tirupati Crane Accident Four Dead

సాక్షి,తిరుపతి: నగరంలోని డీబీఆర్‌ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో క్రేన్, జేసీబీ విరిగిపడిన దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీ కన్వెన్షన్ పక్కనే ఉన్న స్థలంలో నంది గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా సుమారు 30 అడుగుల మేర పునాదులు తీస్తున్నారు. ఈ క్రమంలో మట్టి తోలుతున్న జేసీబీ,క్రేన్ అకస్మాత్తుగా విరిగిపడటంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఒరిస్సాకు చెందిన వలస కూలీ రామారావు, శ్రీకాకుళానికి చెందిన సైట్ ఇంజనీర్ సందీప్, తిరుపతికి చెందిన సెక్యూరిటీ గార్డు గంగయ్య (45)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బీహార్ రాష్ట్రానికి చెందిన షేక్ ఫర్హాన్, నౌషాన్, అలాగే మల్లవరానికి చెందిన మురుగయ్యలను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

అధికారుల పరిశీలన
ప్రమాద స్థలాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 

ఇదీ చదవండి: ఒక్కసారి పుట్టింటికి పంపండి... రెండ్రోజులు ఉండి వస్తా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement