ఆంధ్రప్రదేశ్: నిండుచూలాలు... ఒకసారి పుట్టింటికెళ్లి అమ్మనాన్నను మాట్లాడొద్దామనుకొంది. అందుకు అత్త ఒప్పుకోకపోగా... సూటిపోటి మాటలతో బాధపెట్టింది.. మనస్థాపం చెందిన నాలుగు నెలల గర్భిణి అక్షయ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన కణేకల్లు మండలంలోని నల్లపంల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది.
పోలీసుల కథనం మేరకు వివరాలు.. అనంతపురానికి చెందిన కృష్ణ కూతురు అక్షయకు కణేకల్లు మండలంలోని నల్లంపల్లిలోని అక్క నాగేవేణి కొడుకు మహేష్‌కిచ్చి ఎనిమిది నెలల క్రితం వివాహం చేశాడు.పెళ్లయినప్పటి నుంచి అత్త, కోడలి మధ్య నిత్యం ఏదో విషయంలో గొడవ జరుగుతూ ఉండేది. ఈ విషయాన్ని అక్షయ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి బాధపడేది. అక్షయ గర్భం దాల్చింది. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి.
15 రోజుల క్రితం అక్షయ తల్లిదండ్రులు నల్లంపల్లి గ్రామానికొచ్చి తమ కూతుర్ని మా ఇంటికి తీసుకెళ్తాం.. కొన్నాళ్లూ ఉండి వస్తుందని అడిగితే నాగవేణి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం అక్షయ ఒక్కసారి పుట్టింటికి పంపండి... రెండ్రోజుల ఉండి వస్తానని అడిగింది. అందుకు అత్త ససేమిరా అనింది. ఇప్పుడు వెళ్లొద్దని.. ఐదు నెలలు పూర్తయ్యాక వెళ్లు.. పంపిస్తానంటూ కస్సుబుస్సు మనింది. ఇప్పుడే వెళ్తానంటే వెళ్లు.. మళ్లీ రావద్దని గట్టిగా చెప్పింది.
బేల్దారి పని చేస్తున్న కొడుకు మహేష్ రెండ్రోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండటంతో ఇంటిపట్టున ఉంటే కుటుంబం గడిచేదెలా? అంటూ కొడుకును కూడా నాగవేణి మందలించింది. దీంతో మహేష్ విసుగు చెంది ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పటికే ఆమె ఇంట్లోని బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా కనిపించింది. అక్షయ గర్భిణి కావడంతో మృతదేహానికి అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. బాధిత తండ్రి కృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు..అత్త నాగవేణి, అల్లుడు మహేష్, ఆడబిడ్డ కవిత, ఆమె భర్త రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగమధు తెలిపారు.
గమనిక..
మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com
ఇదీ చదవండి: ప్రేమించాలని వేధింపులు.. విద్యార్థిని విషాదం!ద


