హర్రర్ కామెడీగా 'ఇదేం దెయ్యం' | Idhem Dayyam Audio release | Sakshi
Sakshi News home page

హర్రర్ కామెడీగా 'ఇదేం దెయ్యం'

Jul 23 2017 2:24 PM | Updated on Jul 12 2019 4:40 PM

హర్రర్ కామెడీగా 'ఇదేం దెయ్యం' - Sakshi

హర్రర్ కామెడీగా 'ఇదేం దెయ్యం'

ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్పణ‌లో చిన్మయానంద ఫిల్మ్స్ ప‌తాకంపై ఎస్. స‌రిత నిర్మిస్తోన్న చిత్రం 'ఇదేం దెయ్యం'.

ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్పణ‌లో చిన్మయానంద ఫిల్మ్స్ ప‌తాకంపై ఎస్. స‌రిత నిర్మిస్తోన్న చిత్రం 'ఇదేం దెయ్యం'. శ్రీనాధ్ మాగంటి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాక్షి క‌క్కర్ , ర‌చ‌న స్మిత్, రుచి పాండే నాయిక‌లు. ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్.పి కీల‌క పాత్రధారులు. వి. ర‌వివ‌ర్మ ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా,  బాలు స్వామి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కర‌ణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

ముఖ్య అతిధులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్యక్షుడు ప్రతాని రామ‌కృష్ణ సీడీల‌ను ఆవిష్కరించి యూనిట్ స‌భ్యుల‌కు అంద‌జేశారు. ఇటీవల వెండితెర మీద సక్సెస్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న హర్రర్ కామెడీ జానర్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ కార్యక్రమంలో ద‌ర్శకుడు సాగ‌ర్, తుమ్మల‌ప‌ల్లి రామ‌స‌త్యానారాయ‌ణ‌, సాయి వెంక‌ట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement