ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంక ఎప్పటికప్పుడూ..పలు స్ఫూర్తిదాయక స్టోరీలు, ఆరోగ్యం గురించి అభిమానులతో పంచుకుంటుంటారు. ఈసారి మాత్రం తనకెంతో ఇష్టమైన వంటకం గురించి షేర్ చేశారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో గుజరాత్‌లో అత్యంత ఇష్టపడే వీధి వంటకం గురించి పంచుకున్నారు.
దాన్ని ఆయన బర్గర్‌కి మించి రుచికరంగా ఉంటుందని అన్నారు. ఆ వంటకం పుట్టుక..రుచి గురించి సవివరంగా రాసుకొచ్చారు. ఇంతకీ ఏంటా వంటకం అంటే.. గుజరాతీ స్ట్రీట్ ఫుడ్ అయిన దాబేలీ గురించి రాసుకొచ్చారు. ఈ వంటకం ఎవరికైనా ఆకలి పుట్టించేలా ఉంటుందన్నారు. దీన్ని మసాలా చిలగడదుంప, చట్నీలు, వేరుశెనగలు, సేవ్, దానిమ్మ గింజలతో కలగలిపిన మృదువైన పావ్ అని అన్నారు.
బర్గర్‌కు సరైన సమాధానం ఈ గుజరాతీ వంటకం అని అన్నారు. దీన్ని చూడగానే ఎవరికైన ఆకలి పుడుతుందని అంటుననారు. తీపి, కారం, కరకరలాడే పుల్లని రుచిని కలిగి ఉంటుందన్నారు. తాను వడాపావ్, బర్గర్ కంటే ఎక్కువగా దీన్నే ఇష్టపడతానని చెప్పారు. ముంబె, గుజరాత్ వెలుపల ఉన్న ప్రజలకు ఈ దాబేలి గురించి అస్సలు తెలియదంటూ పోస్ట్ ముగించారు.
కాగా, దాబేలి కచ్‌లోని మాండ్వీలో పుట్టిన వంకటం. దీన్ని కచ్చి దాబేలీ లేదా డబుల్ రోటీ అని పిలుస్తారు. గుజరాత్ కచ్ జిల్లా, మాండ్వీలో పుట్టింది ఈ ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది 1960 నుంచి వాడుకలో ఉంది.
ఈ చిరుతిండిని మాండ్వీలోని కేశవ్‌జీ గాభా చూడాసమా అనే పాక నిపుణుడు తయారు చేశారని చెబుతుంటారు. ఆయనే మొదట దీన్ని విక్రయించారని, అప్పుడు ధర ఆరు పైసలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. నేటికీ ఆయన కుటుంబమే ఈ వంటకం దుకాణాన్ని నిర్వహిస్తోందని చెప్పుకొచ్చారు.
Dabeli is Gujarat’s answer to the burger 😋! A soft pav stuffed with spicy-sweet potato, chutneys, peanuts, sev and pomegranate. Sweet, spicy, crunchy and tangy. I much prefer it to vada pav and burger. Unfortunately most outside of Mumbai and Gujarat are unfamiliar with it! pic.twitter.com/15sW2qgTNw
— Harsh Goenka (@hvgoenka) August 17, 2026
(చదవండి: ట్రెడిషనల్ డిజైనర్‌వేర్‌లో రిషబ్ సెట్టి స్టన్నింగ్ లుక్..! స్వయంగా ఆయన భార్య..)


