'నా బ్యాట్లు ఎవ‌రో దొబ్బేశారు.. మ‌ర్యాద‌గా ఇచ్చేయండి!' | Deepak Chahar Reveals 3-Bats Worth 1 Lakh Above-Stolen-Practice Venue | Sakshi
Sakshi News home page

'నా బ్యాట్లు ఎవ‌రో దొబ్బేశారు.. మ‌ర్యాద‌గా ఇచ్చేయండి!'

Sep 29 2026 9:27 PM | Updated on Sep 29 2026 9:31 PM

Deepak Chahar Reveals 3-Bats Worth 1 Lakh Above-Stolen-Practice Venue

Photo Credit: Twitter

టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడికి ఎంతో ఇష్టమైన ఖరీదైన క్రికెట్ బ్యాట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా చాహర్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాట్లు పోయాయనే బాధలో ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని అతడు వ్యంగ్యంగా వెల్ల‌డించిన‌ తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే, ప్రాక్టీస్ గ్రౌండ్‌లో ఉంచిన దీపక్ చాహర్ బ్యాట్లు అపహరణకు గురయ్యాయి. సుమారు రూ.1.5 లక్షల విలువైన మూడు ప్లేయర్-ఎడిషన్ బ్యాట్లు కనిపించకుండా పోయాయని అతడె వెల్లడించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ ఘటన గురించి వివరిస్తూనే సదరు దొంగకు తనదైన శైలిలో విజ్ఞ‌ప్తి చేశాడు.

"ఆ బ్యాట్లను దొంగిలించిన వ్యక్తికి బహుశా వాటి అసలు విలువ తెలియకపోవచ్చు. వాటితో అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడతాడో లేక మరెవరికైనా విక్రయిస్తాడో తెలీదు. అదేదో నేరుగా నా దగ్గరికే వచ్చి డబ్బులు అడిగి ఉంటే ఇచ్చేవాడిని కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? 

పోలీసులకు ఫిర్యాదు చేయాలా? లేక యోగి గారి దగ్గరికో, మోదీ గారి దగ్గరికో వెళ్లాలా? లేదంటే ఆ దేవుడిని వేడుకోవాలా? అదీ కాదంటే మరో రెండు, మూడు బ్యాట్లు పంపమని తయారీ కంపెనీని అడగాలా?" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం అత‌డి వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

ఇదీ చదవండి: స‌చిన్‌కు సాధ్యం కాలేదు.. దిగ్గ‌జం రికార్డుపై కన్నేసిన కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement