ఆసీస్‌ను చితకొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజు ముగిసిన ఆట | IND-A-Women Vs AUS-A Women-Only-Unofficial Test-Day-1 Stumps | Sakshi
Sakshi News home page

Ind A-W Vs AUS A-W: ఆసీస్‌ను చితకొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజు ముగిసిన ఆట

Sep 29 2026 6:50 PM | Updated on Sep 29 2026 7:03 PM

IND-A-Women Vs AUS-A Women-Only-Unofficial Test-Day-1 Stumps

Photo Credit: Twitter

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఆస్ట్రేలియా-ఎ వుమెన్‌తో జ‌రుగుతున్న ఏకైక అన‌ధికారిక టెస్టు మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే స‌మ‌యానికి 100 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 351 ప‌రుగులు చేసింది. త‌నిషా సింగ్ (166 బంతుల్లో 92) సెంచ‌రీ చేజార్చుకోగా, నికీ ప్ర‌సాద్ (78 నాటౌట్‌), శుచి ఉపాధ్యాయ్ క్రీజులో ఉన్నారు. 

అంత‌క‌ముందు ఓపెన‌ర్ శుభా స‌తీశ్ (59), అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, ప్రియా పూనియా (46), అనుష్క శ‌ర్మ (44) రాణించారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో లిల్లీ మిల్స్, చార్లీ నాట్ చెరో 3 వికెట్లు తీయ‌గా, టెస్ ఫ్లింటాఫ్‌, మిల్లీ ఇల్లింగ్‌వ‌ర్త్‌, ఫ్రాంకీ నిక్లిన్ త‌లా ఒక వికెట్ తీశారు. 120 ప‌రుగుల‌కు నాలుగు వికెట్లు కోల్పోయిన క్ర‌మంలో అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి త‌నిశా సింగ్ ఐదో వికెట్‌కు 82 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. 

అనంత‌రం అనుష్క ఔటైన‌ప్ప‌టికీ, క్రీజులోకి వ‌చ్చిన నికీ ప్ర‌సాద్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. సెంచ‌రీ వైపు ప‌రిగెడుతున్న త‌నిశా సింగ్‌ను టెస్ ఫ్లింటాఫ్ ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్ చేర్చింది. అయితే నికీ ప్ర‌సాద్ మాత్రం మ‌రో ఎండ్‌లో ధాటిగా ఆడుతూ స్కోరును పెంచే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలోనే భార‌త్ స్కోరు 350 మార్క్‌ను దాటింది.

ఇదీ చదవండి:  భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement