Photo Credit: Twitter
ఆసియా గేమ్స్‌లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ హ్యాట్రిక్ పతకాలు సాధించాడు. ఇప్పటికే పదివేల మీటర్లు, 1500 మీటర్ల రేసులో రజతాలు సాధించిన గుల్వీర్.. తాజాగా మంగళవారం 5వేల మీటర్ల రేసులో కాంస్యం గెలుచుకున్నాడు. గుల్వీర్ 13:32.75 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్యం ఒడిసిపట్టగా, బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బాలే (13:30.79 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, జపాన్ అథ్లెట్ యమాగుచి టొమొనొరి (13:31.43 సెకన్లు) రజతం అందుకున్నాడు.
ఇక ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు దూకుడు కనబరుస్తున్నారు. సూపర్ పంచ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ పసిడి వేటకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్లో అదిరే విజయంతో ప్రవీణ్ హుడా(65 కిలోలు), అంకుశ్ పంఘల్(80 కిలోలు)లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. తద్వారా కనీసం రజతం ఖాయం చేశారిద్దరు. పురుషుల 90 ప్లస్ క్వార్టర్స్‌లో విఫలమైన నరేందర్ బెర్వాల్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
సెమీఫైనల్ చేరి కనీసం కాంస్యం ఖరారు చేసిన ఆరుగురు భారత బాక్సర్లలో ఇద్దరు ఫైనల్లో అడుగుపెట్టారు. మహిళల విభాగంలో ప్రవీణ్ హుడా(65 కిలోలు), పురుషుల విభాగంలో అంకుశ్ పంఘల్(80 కిలోలు)లు ఫైనల్ చేరుకున్నారు. మంగళవారం ఏకపక్ష పోరులో చైనా బాక్సర్ లీ షుపై 5-0తో గెలుపొందిన హుడా స్వర్ణంపై గురి పెట్టింది.
పురుషుల క్వార్టర్స్‌లో దుమ్మురేపిన అంకుశ్ సెమీస్‌లోనూ పంజా విసిరాడు. అతడి ధాటికి వరల్డ్ ఛాంపియన్ ఫజ్లిద్దిన్ ఎర్కిన్‌బొయెవ్(ఉబ్జెకిస్థాన్) చేతులెత్తేశాడు. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో ఫైనల్ చేరిన భారత బాక్సర్‌గా అంకుశ్ రికార్డు నెలకొల్పాడు. మరో బౌట్‌లో.. నరేందర్ బెర్వాల్ కంగుతిన్నాడు. పురుషుల 90 ప్లస్ విభాగంలో ఆశలు రేపిన అతడు వరల్డ్ ఛాంపియన్ ఐబెక్ ఒరల్‌బే చేతిలో ఊహించని ఓటమితో కాంస్యం అందుకున్నాడు.
WATCH HISTORY IN THE MAKING.
🇮🇳 GULVEER SINGH IS AN INSPIRATION TO MILLIONS OF ATHLETES.
THREE RACES. THREE MEDALS.
🥈 10,000m — 28:29.38
🥈 1500m — 3:36.72 PB
🥉 5000m — 13:32.75
From 1500m to 10,000m, Gulveer has finished on the podium in EVERY DISTANCE he raced in Nagoya.…— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 29, 2026
ఇదీ చదవండి: 'బతికుండగానే చంపేశారు'.. పాక్ క్రికెటర్ ఆవేదన!


