భారత్‌, పాక్ మధ్య ఫైనల్‌!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా? | Asian Games: What-If-Final Likely IND Vs PAK-Washed Out-Who-Win-Gold | Sakshi
Sakshi News home page

భారత్‌, పాక్ మధ్య ఫైనల్‌!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?

Sep 29 2026 3:50 PM | Updated on Sep 29 2026 4:53 PM

Asian Games: What-If-Final Likely IND Vs PAK-Washed Out-Who-Win-Gold

Photo Credit : Twitter

ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ విభాగంలో క్వారర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ వరుసగా వర్షార్పణమయ్యాయి. భారత్ వర్సెస్‌ అఫ్గానిస్తాన్‌, నేపాల్ వర్సెస్‌ శ్రీలంక, పాకిస్తాన్ వర్సెస్ హాంకాంగ్‌, బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ వర్షంతో రద్దయ్యాయి. దీంతో ర్యాంకుల ఆధారంగా భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు సెమీస్‌కు అర్హత సాధించాయి. 

గురువారం జరగనున్న సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌, భారత్‌తో శ్రీలంక తలపడనున్నాయి. జపాన్‌లోని కొరోగొ అథ్లెటిక్ పార్క్ ఆతిథ్యమిమ్వనున్న మ్యాచ్‌లకు కూడా 60 శాతం వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్‌లు కూడా వర్షంతో రద్దయితే.. మెరుగైన ర్యాంక్ కారణంగా భారత్‌, పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టనున్నాయి. 

శ‌నివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దయితే అప్పుడు పరిస్థితి ఏంటి.. ఏ జట్టుకు ఏ పతకం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. వర్షంతో ఫైనల్ రద్దయితే సాధారణంగా రెండు జట్లలో మెరుగైన ర్యాంకులో ఉన్న జట్టుకు స్వర్ణ పతకం దక్కుతుంది. ఈ లెక్కన వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్న టీమిండియాకు మరోమారు స్వర్ణం.. పాక్‌కు రజతం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. 

2023లో జరిగిన హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో ఫైనల్ వర్షార్పణం కావడంతో భారత్ పసిడి, ఆఫ్గన్ రజతం గెలుచుకున్నాయి. కానీ ఈసారి గేమ్స్‌లో మాత్రం చిన్న ట్విస్ట్ దాగుంది. ఒకవేళ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్దయితే మాత్రం భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా స్వర్ణం పతకం అందుకోనుంది. 

వర్షం అంతరాయంతో మ్యాచ్‌ రద్దయితే, మెరుగైన ర్యాంకులో ఉన్న జట్టుకు స్వర్ణం అందిస్తే, మరో జట్టుకు అన్యాయం జరిగినట్లవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసియా గేమ్స్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఒకవేళ ఇది జరిగితే మాత్రం భారత్‌, పాకిస్తాన్‌లు ఒకే వేదికపై పడిసి పతకం అందుకోనుండడం చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుంది. 

ఇదే ఆసియా గేమ్స్‌లో ఇప్పటికే భారత మహిళల జట్టు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి స్వర్ణం దక్కించుకుంది.

ఇదీ చదవండి: దిగ్గ‌జాల విష‌యంలో త‌మిళ‌నాడు క్రికెట్ కీల‌క నిర్ణ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement