Asian Games Cricket: సెమీస్‌ చేరిన జట్లు, షెడ్యూల్‌, టైమింగ్స్‌ | Asian Games 2026, 4 Matches Abandoned, India To Face Sri Lanka In Semis, Check Full Schedule, Match Timings & Where to Watch Details | Sakshi
Sakshi News home page

Asian Games Cricket: సెమీస్‌ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్‌, టైమింగ్స్‌

Sep 29 2026 1:31 PM | Updated on Sep 29 2026 2:05 PM

Asian Games 2026 Cricket 4 Matches Abandoned Semis Teams IND To Face

ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్‌ టోర్నమెంట్లో వర్షం కారణంగా చిన్న జట్లకు క్వార్టర్‌ ఫైనల్స్‌లో కనీసం మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా దొరకలేదు. జపాన్‌ వేదికగా క్వార్టర్‌ ఫైనల్స్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌- హాంకాంగ్‌,చైనా సోమవారం  తలపడాల్సి ఉండగా వాన వల్ల టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దై పోయింది.

పాక్‌, భారత్‌ నేరుగా సెమీస్‌కు
అదే రోజు టీమిండియా- అఫ్గానిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ కూడా టాస్‌ పడకుండానే వర్షార్పణమైంది. ఫలితంగా ప్రత్యర్థుల కంటే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థితిలో ఉన్న పాకిస్తాన్‌, టీమిండియా నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి.

అదే పరిస్థితి పునరావృతం
అదే విధంగా మంగళవారం మూడు, నాలుగు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లలో భాగంగా శ్రీలంక- నేపాల్‌.. బంగ్లాదేశ్‌- మలేషియా తలపడాల్సి ఉండగా.. ఇదే పరిస్థితి పునరావృతమైంది. వాన కారణంగా ఈ రెండు మ్యాచ్‌లు టాస్‌ పడకుండానే రద్దు కాగా.. ర్యాంకింగ్స్‌ ప్రకారం శ్రీలంక, బంగ్లాదేశ్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి.

సెమీ ఫైనల్స్‌ షెడ్యూల్‌ ఇదే
👉గురువారం (అక్టోబరు 1)
👉వేదిక: కరోగి స్పోర్ట్స్‌ పార్కు, నిశిన్‌, జపాన్‌

తొలి సెమీ ఫైనల్‌: పాకిస్తాన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ 
👉మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభం

రెండో సెమీ ఫైనల్‌: టీమిండియా వర్సెస్‌ శ్రీలంక
మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు ప్రారంభం

కాంస్య పతక పోరు, ఫైనల్‌
👉శనివారం (అక్టోబరు 3): సెమీస్‌లో ఓడిన జట్ల మధ్య మ్యాచ్‌ (ఉదయం: ఐదున్నర గంటలకు ఆరంభం)
👉అదే రోజు సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్‌ (ఉదయం: పది గంటలకు ఆరంభం).

అన్ని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం
👉సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ (టీవీ), సోనీ లివ్‌ (డిజిటల్‌)

జట్లు
భారత్‌
సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్.

పాకిస్తాన్‌
సాహిబ్‌జాదా ఫర్హాన్(కెప్టెన్‌), సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్‌ కీపర్‌), హసన్ నవాజ్, హైదర్ అలీ, అబ్దుల్ సమద్, మొహమ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మొకిమ్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అరాఫత్ మిన్హాస్, సాద్ మసూద్, మాజ్ సదాకత్, అలీ రెజా

శ్రీలంక
అషెన్ బండార, లసిత్ క్రూస్‌పుల్లే, సినీత్ జయవర్దన, నిరోషన్ డిక్వెల్లా(వికెట్‌ కీపర్‌), నువానీదు ఫెర్నాండో, సహన్ అరాచ్చిగే (కెప్టెన్‌), చమిక కరుణరత్నే, దుషన్ హేమంత, బినుర ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, నువాన్ తుషార, తరిందు రత్నాయకే, వనుజా సహన్, సోహాన్‌ డి లివేరా, గరుక సంకేత్‌

బంగ్లాదేశ్‌
లిట్టన్ దాస్(కెప్టెన్‌), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్(వికెట్‌ కీపర్‌), తౌహిద్ హృదయ్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుమ్ అహ్మద్, సైఫ్ హసన్, మెహెదీ హసన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, రిషాద్ హొసేన్‌.

చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement