షూటింగ్‌లో మరో రజతం.. 50 పతకాల దిశగా భారత్‌ | Asian Games 2026 Day 10: Shooters Clinch Another Silver, India Inches Closer To 50 Medal Mark | Sakshi
Sakshi News home page

Asian Games 2026: షూటింగ్‌లో మరో రజతం.. 50 పతకాల దిశగా భారత్‌

Sep 29 2026 9:15 AM | Updated on Sep 29 2026 9:21 AM

Asian Games 2026 Day 10: Shooters Clinch Another Silver, India Inches Closer To 50 Medal Mark

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత్‌ 10వ రోజు పతకాల వేటను రజతంతో ప్రారంభించింది. మహిళల టీమ్‌ ట్రాప్‌ షూటింగ్‌లో భారత జట్టు (నీరూ ధండ, అషిమ అహ్లావత్‌, మనీష కీర్‌) రజత పతకం సాధించింది. దీంతో భారత్‌ 50 పతకాల (46) మార్క్‌కు మరింత చేరువైంది.

మరోవైపు నీరూ ధాండా మహిళల వ్యక్తిగత షూటింగ్‌ విభాగంలో అదరగొట్టింది. ఆమె 118 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించింది.

పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు పతకం దక్కలేదు. అయితే శపత్‌ భరద్వాజ్‌ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించాడు.

భారత ఆర్చర్ల జోరు
పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో ధీరజ్‌ బొమ్మదేవర ఫిలిప్పీన్స్‌కు చెందిన గిర్విన్‌ గార్సియాను 6-0తో ఓడించి రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరాడు. అనంతరం చైనీస్‌ తైపీకి చెందిన చెంగ్‌ హ్సియాంగ్‌-హుయ్‌పై 6-2తో విజయం సాధించాడు.

నీరజ్‌ చౌహాన్‌ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండోనేషియాకు చెందిన రియావు ఎగా అగత సల్సబిల్లాపై 6-4తో గెలిచిన అతడు, ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ జె-డియోక్‌ను కూడా 6-4తో ఓడించి రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరాడు.

స్క్వాష్‌లో విజయం
మహిళల టీమ్‌ స్క్వాష్‌ పూల్‌-సి మ్యాచ్‌లో భారత్‌ 2-0తో ఇరాన్‌ను ఓడించింది. తాన్వీ ఖన్నా, అనాహత్‌ సింగ్‌ భారత విజయానికి కారణమయ్యారు.

బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌పై దృష్టి
బాక్సింగ్‌లో పర్వీన్‌, అంకుష్‌ పాంగల్‌, నరేందర్‌ సెమీఫైనల్స్‌లో బరిలోకి దిగనున్నారు. వీరు ఫైనల్‌కు చేరితే భారత్‌కు కనీసం మరో మూడు రజతాలు ఖాయమవుతాయి.

అథ్లెటిక్స్‌లో గుల్వీర్‌ సింగ్‌, అవినాశ్‌ సేబుల్‌, గురిందర్‌వీర్‌ సింగ్‌, అనిమేశ్‌ కుజూర్‌, హరితా భద్ర తదితర భారత అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు.

సైక్లింగ్‌లో మిశ్రమ ఫలితాలు
పురుషుల టీమ్‌ స్ప్రింట్‌లో రోజిత్‌ సింగ్‌, డేవిడ్‌ బెక్హమ్‌, రొనాల్డ్‌ సింగ్‌ 44.895 సెకన్లతో ఏడో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ చైనాతో తలపడనున్నారు.

మహిళల టీమ్‌ స్ప్రింట్‌లో సెలెస్టినా, సరితా కుమారి, కీర్తి రంగస్వామి చిక్కా 50.414 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్‌లో చైనీస్‌ తైపీతో పోటీ పడనున్నారు.

మహిళల టీమ్‌ పర్స్యూట్‌లో హర్షితా ఝాకర్‌, పూజా దనోలే, మీనాక్షి, స్వస్తి సింగ్‌ల బృందం ఐదో స్థానంలో నిలిచి హెడ్‌-టు-హెడ్‌ హీట్స్‌కు అర్హత సాధించింది.

ఇదీ చదవండి: Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement