PC: X
ఆసియా క్రీడలు-2026 పురుషుల హాకీ పోటీల్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన పూల్-ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10-0 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. ఆఖరి మ్యాచ్‌లోనూ విజృంభించింది.
ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (27, 40, 45వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా, లక్రా శిలానంద్ (44, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. అలాగే అభిషేక్, జుగ్‌రాజ్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, సంజయ్ మరియు మన్‌దీప్ సింగ్ తలా ఒక గోల్ చేసి భారత్ భారీ విజయంలో భాగమయ్యారు.
ఈ విజయంతో పూల్-ఎ విభాగంలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, అక్టోబర్ 1న జరగనున్న తొలి సెమీఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. భారత జట్టు జోరును బట్టి చూస్తే దాయాది జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.


