Photo Credit: Twitter
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత జట్టు యువ ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందని డబుల్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు 92 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది.
లక్ష్య రాజేశ్ (256 బంతుల్లో 210 నాటౌట్), మోహిత్ ఉల్వా (58 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో క్రీజులో ఉన్నారు. భారత్ ఇప్పటివరకు 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే మ్యాచ్‌లో ఒకపక్క వికెట్లు పడుతున్నప్పటికీ ఏకాగ్రతను కోల్పోకుండా బ్యాటింగ్ కొనసాగించిన లక్ష్య రాజేశ్ చూస్తుండగానే సెంచరీని అద్భుత ద్విశతకంగా మలిచాడు.
247 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్ సాధించిన లక్ష్య రాజేశ్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ యశ్‌బర్ధన్ (54) ఔటైన తర్వాత భారత్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లోయర్ ఆర్డర్‌లో మానవ్ కృష్ణ (25), అయాన్ అక్రమ్ (26) వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో భారత్ ఆధిక్యం పెరగడంలో సహకరించారు.
వీరిద్దరు వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన మోహిత్ ఉల్వా అజేయ అర్థసెంచరీతో మెరవడమే గాక, లక్ష్య రాజేశ్‌కు అండగా నిలబడి, డబుల్ సెంచరీ చేసేందుకు సహయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కాసీ బార్టన్ 3 వికెట్లు తీయగా, స్పెన్సర్ గ్రీన్, కొన్నోర్ గ్రేగరి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు 217 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇదీ చదవండి: Asian Games: జ్యోతి సురేఖకు షాకిచ్చిన 14 ఏళ్ల సంచలనం


