ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా ఓపెనర్‌ | India U19 vs Australia U19 1st Unofficial test: Lakshya Rajesh Raichandani slams century | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా ఓపెనర్‌

Sep 28 2026 1:34 PM | Updated on Sep 28 2026 1:34 PM

India U19 vs Australia U19 1st Unofficial test: Lakshya Rajesh Raichandani slams century

source: X

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత అండర్‌-19 జట్టు ఓపెనర్‌ లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందని సెంచరీతో కదంతొక్కాడు. నిన్న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

ఓపెనర్‌ లక్ష్య రాజేశ్‌ రెండో రోజు రెండో సెషన్‌లో సెంచరీ పూర్తి చేశాడు. 139 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మూడంకెల మార్కును తాకాడు. ఓ పక్క వరుసగా వికెట్లు పడుతున్నా, రాజేశ్‌ పట్టుదలతో క్రీజ్‌లో నిలబడి, సెంచరీ పూర్తి చేయడమే కాకుండా జట్టు పరువును కూడా కాపాడాడు. ఓ దశలో ఆసీస్‌ బౌలర్లు రెచ్చిపోవడంతో భారత్‌ 3 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి పతనమయ్యేలా కనిపించింది.

అయితే రాజేశ్‌ కుదురుగా క్రీజ్‌లో నిలబడి భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా తీసుకెళ్తున్నాడు. రాజేశ్‌కు కెప్టెన్‌ యశ్‌వర్దన్‌ చౌహాన్‌ (54) కాసేపు సహకరించాడు. యశ్‌వర్దన్‌, మనల్‌ చౌహాన్‌ (0), కుశ్‌ పటేల్‌ (1) మూడు పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది. రాజేశ్‌.. మానవ్‌ కృష్ణ (7) సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. 49 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 196-5గా ఉంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 22 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది.

అంతకుముందు ఆసీస్‌ తరఫున బ్లేక్‌ క్యాటిల్‌ (102) సెంచరీ చేశాడు. జెడ్‌ హెల్లిక్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ ఓం 5 వికెట్లతో సత్తా చాటగా.. మోహిత్‌ ఉల్వా 3, యశ్‌వర్దన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

కాగా, 3 మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌, రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం​ ఆస్ట్రేలియా అండర్‌ 19 జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ముందుగా జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

ఇదీ చదవండి: బవుమా-డికాక్ మధ్య తీవ్ర వాగ్వాదం



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement