breaking news
Lakshya Rajesh Raichandani
-
IND vs SL: శ్రీలంకను మట్టికరిపించిన భారత్
శ్రీలంకతో రెండో అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జట్టును ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.తొలి టెస్టు డ్రా కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక యువ జట్టు 2-1తో వశం చేసుకోగా.. ఇరుజట్ల మధ్య గాలె వేదికగా తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.తొలి ఇన్నింగ్స్‌లో 411ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.శతక్కొట్టిన కుశాగ్ర, మనాల్మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ అయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (111), ఐదో స్థానంలో వచ్చిన మనాల్ చౌహాన్ (150) శతకాలతో అదరగొట్టారు. వీరికి తోడుగా కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (78)తో రాణించాడు. లోయర్ ఆర్డర్లో చిగురుపాటి వెంకట 25 పరుగులు రాబట్టాడు.148 పరుగులకే లంక ఆలౌట్ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 148 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31, సెత్మిక 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హెంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కావ్యా పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.లక్ష్యం 472ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈసారి ఓపెనర్లలో లక్ష్య రాయ్‌చందాని అజేయ శతకం (116 బంతుల్లో 100)తో మెరవగా.. సాగర్ విర్క్ (17) నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్యన్ సక్పా (6) విఫలం కాగా.. కెప్టెన్ యశ్వర్దన్ 20 పరుగులు చేయగలిగాడు. మనాల్ చౌహాన్ 51 పరుగలతో అజేయంగా నిలిచాడు.211 పరుగుల తేడాతో భారత్ జయభేరిఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (263+208).. భారత్ శ్రీలంకకు 472 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 211 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.చెలరేగిన భారత బౌలర్లులక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లలో సెనుజ వెకునగొడ (64), కెప్టెన్ విమత్ దిన్సార (64) అర్ధ శతకాలతో రాణించగా.. కవిజ గెమాగే 36, సెత్మిక 42 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రోహిత్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చిగురుపాటి వెంకట మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన వారిలో ప్రణవ్ రాఘవేంద్ర, జగన్నాథన్ హెంచుదేశన్, యశ్వర్దన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.శ్రీలంక వర్సెస్ భారత్ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లుభారత్: 411 & 208/3 డిక్లేర్డ్శ్రీలంక: 148 & 260చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
డబుల్ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు.మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఇరుజట్ల మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది.గాలె వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (267 బంతుల్లో 233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (45), ఒషాడా మనాహర (31*) రాణించారు. ఆధిక్యంలోకి భారత్ఫలితంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ ఆట మొదలుపెట్టిన భారత్.. గురువారం భోజన విరామ సమయానికి 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 378/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ టైమ్‌కి 149 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 479 పరుగులు చేసింది.లక్ష్య డబుల్ సెంచరీతోకాగా బుధవారం 196 పరుగుల వద్ద నిలిచిన లక్ష్య.. గురువారం ద్విశతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 324 బంతుల్లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 207 పరుగులు సాధించాడు. దిమత్ అబేయ్సింఘే బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో లక్ష్య మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక మిగలిన వారిలో మరో ఓపెనర్ సాగర్ విర్క్ శతకం (134) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులు చేశాడు. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) విఫలం కాగా.. కుశ్ పటేల్ 42 పరుగులతో రాణించాడు. గురువారం లంచ్ బ్రేక్ సమయానికి బీకే కిషోర్ 1, మానవ్ క్రిష్ణ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు కావ్యా పటేల్ (8), జగన్నాథన్ హేంచుదేశన్ (0) అవుటయ్యారు. ఆటకు ఇదే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే కానుంది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
IND vs SL: శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, సాగర్ విర్క్ శతక్కొట్టారు. నిలకడగా, ఓపికగా ఆడుతూ భారీ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది.శ్రీలంక భారీ స్కోరు కాగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52) అర్ధ శతకం బాదాడు.మిగిలిన వారిలో కవిజ గమాగే (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది.ఈ క్రమంలో 186/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టుకు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. అయితే, కాసేపటి తర్వాత తెరిపినివ్వడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లుఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న ఓపెనర్ సాగర్ (312 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్: 134 రన్స్).. లతేంద్ర ఆకాశ్ బౌలింగ్‌లో జేసన్ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులే చేసి నిరాశపరచగా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్ లక్ష్య మాత్రం నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.గాలేలో బుధవారం ఆట పూర్తయ్యేసరికి మొత్తంగా 306 బంతులు ఎదుర్కొన్న లక్ష్య.. 21 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 196 పరుగులు చేశాడు. అతడితో పాటు కుశ్ పటేల్ మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఆటకు గురువారం చివరిరోజు. చదవండి: IND vs ENG: అతడిని ఆరోస్థానంలో ఆడిస్తారా? -
అదరగొట్టిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టులో భారత్ అండర్ -19 ఓపెనర్లు అదరగొడుతున్నారు. లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ పట్టుదలగా నిలబడి భారత్ జట్టుకు శుభారంభం అందించారు.కాగా గాలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగి.. మొదటి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్లు దిమంత మహావితన (2), దుల్నిత్ సిగెర (0) విఫలమైనా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ దుమ్ములేపాడు.మొత్తంగా 267 బంతులు ఎదుర్కొని 33 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 233 పరుగులు సాధించాడు. సెనుజ డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు.ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద శ్రీలంక మంగళవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టగా వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం కలిగింది.అయితే, వాన తెరిపినివ్వడంతో తిరిగి ఆట మొదలుకాగా.. ఓపెనర్లు లక్ష్య, సాగర్ నిలకడగా ఆడారు. లక్ష్య 136 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 93 పరుగులు.... సాగర్ 215 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.ఫలితంగా రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ అండర్-19 జట్టు 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఇక రెండో రోజు మొత్తంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 186 పరుగులు చేసిన భారత్ మొత్తానికి మంగళవారం పైచేయి సాధించింది.


