PC: ACC Media X
ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్-2026 వన్డే టోర్నమెంట్లో భారత యువ జట్టు సత్తా చాటింది. సమష్టి ప్రదర్శనతో పసికూన నేపాల్‌ను ఓ ఆట ఆడుకుంది. అల్ ఎమిరెట్‌లో జరుగుతున్న ఈ యాభై ఓవర్ల ఫార్మాట్ టోర్నీలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్- నేపాల్ తలపడ్డాయి.
128 పరుగులకే ఆలౌట్
టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 42.3 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. భారత యువ పేసర్లు ఇషాన్ సూద్, అర్జున్ రాజ్‌పుత్ ఆకాశమే హద్దుగా చెలరేగి చెరో మూడు వికెట్లు కూల్చి.. నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు.
Ishan Sood is ripping through Nepal U19's top order with a three-wicket burst! 💥 Watch #INDvNEP in the #DPWorldMensU19AsiaCup2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV https://t.co/TcYlEo7yXp
— Sony Sports Network (@SonySportsNetwk) November 6, 2026
మిగిలిన వారిలో యశ్‌వీర్ రెండు వికెట్లు దక్కించుకోగా.. కావ్యా పటేల్, మనాల్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. నేపాల్ బ్యాటర్లలో దర్ష్ సోనార్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసింది.
A milestone brought up with a six! The Sehwag signature is hard to miss! 😮💨 Watch #INDvNEP in the #DPWorldMensU19AsiaCup2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV https://t.co/kuzIO94f5x
— Sony Sports Network (@SonySportsNetwk) November 6, 2026
ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసకర ఇన్నింగ్స్
ఓపెనర్లలో.. మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం కేవలం 34 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మరో ఓపెనర్, కెప్టెన్ లక్ష్య సైతం హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తంగా 63 బంతుల్లో నాలుగు ఫోర్లు బాది 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా భారత్ కేవలం 19.1 ఓవర్లలోనే 129 పరుగులు చేసి.. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఇవీ చదవండి: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్


