అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా అల్ అమీరత్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు, భారత అండర్-19 జట్టు ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసం సృష్టించాడు. ఆర్యవీర్ 129 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ జూనియర్ సెహ్వాగ్ తన తండ్రి బ్యాటింగ్‌ను తలపిస్తూ సిక్సర్‌తో తన తొలి అండర్-19 హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 34 బంతుల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 52 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఆర్యవీర్.. 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అతడితో పాటు కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయచందాని(53) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 19.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది. అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో నేపాల్ జట్టు 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లతో చెలరేగగా.. అర్జున్ రాజ్‌పుత్ సైతం మూడు వికెట్లు కూల్చాడు. కావ్యా పటేల్, మనాల్ చౌహాన్ చెరో వికెట్ దక్కించుకోగా.. యశ్‌వీర్ గౌడ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. నేపాల్ బ్యాటర్లలో దర్ష్ సోనార్ 43 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్.. గావస్కర్, కోహ్లి సరసన!


