చెలరేగిన భారత బౌలర్లు.. 128 పరుగులకే ఖేల్‌ ఖతం | ACC Men's U19 Asia Cup 2026: India Bowlers Shines Nepal 128 All Out | Sakshi
Sakshi News home page

చెలరేగిన భారత బౌలర్లు.. 128 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్‌

Nov 6 2026 1:40 PM | Updated on Nov 6 2026 2:20 PM

ACC Men's U19 Asia Cup 2026: India Bowlers Shines Nepal 128 All Out

PC: ACC Media X

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2026 వన్డే టోర్నమెంట్లో భారత బౌలర్లు అదరగొట్టారు. నేపాల్‌ జట్టును 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ చేశారు. గ్రూప్‌- ‘ఎ’లో భాగంగా అల్‌ ఎమిరెట్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత యువ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఇషాన్‌ సూద్‌ విశ్వరూపం 
భారత యువ పేసర్‌ ఇషాన్‌ సూద్‌ నేపాల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. నేపాల్‌ ఓపెనర్‌ ప్రసిద్ధ జైషీ (1), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సూర్యాంశు కొయిరాలా (5).. నాలుగో స్థానంలో వచ్చిన నిశ్చల్‌ ఛెత్రీ (0)లను సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం చేశాడు.

ఈ క్రమంలో మరో ఓపెనర్‌ నీరజ్‌ కుమార్‌ యాదవ్‌ 20 పరుగులతో రాణించగా.. దర్ష్‌ సోనార్‌ 43 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆశిష్‌ లుహార్‌ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

భారత బౌలర్లలో ఇషాన్‌ సూద్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. అర్జున్‌ రాజ్‌పుత్‌ సైతం మూడు వికెట్లు కూల్చాడు. కావ్యా పటేల్‌, మనాల్‌ చౌహాన్‌ చెరో వికెట్‌ దక్కించుకోగా.. యశ్‌వీర్‌ గౌడ్‌ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

భారత్‌ వర్సెస్‌ నేపాల్‌ తుదిజట్లు
భారత్‌
ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, అన్వయ్‌ ద్రవిడ్‌ (వికెట్‌ కీపర్‌), అర్జున్‌ రాజ్‌పుత్‌, ఇషాన్‌ సూద్‌, కావ్యా పటేల్‌, లక్ష్యా రాజేశ్‌ రాయ్‌చందాని (కెప్టెన్‌), మనాల్‌ చౌహాన్‌, మోహిత్‌ ఉల్వా, యశ్‌వీర్‌ గౌడ్‌, వీకే వినీత్‌, యశ్‌వర్దన్‌ చౌహాన్‌

నేపాల్‌
ఆశిష్‌ లుహార్‌ (వికెట్‌ కీపర్‌), అభయ్‌ యాదవ్‌, బిపిన్‌ శర్మ (కెప్టెన్‌), దర్ష్‌ సోనార్‌, నీరజ్‌ కుమార్‌ యాదవ్‌, నిశ్చల్‌ ఛెత్రి, నితేశ్‌ పటేల్‌, ప్రసిద్ధ జైషీ, సచిన్‌ భట్‌, సుశీల్‌ రావల్‌, సూర్యాంశు కొయిరాలా.

ఇవీ చదవండి: Asia Cup: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన శ్రీలంక
‘అతడిని డ్రెసింగ్‌రూమ్‌లోనే కూర్చోబెడతా.. ఇంటికి కూడా వెళ్లనివ్వను’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement