Photo Credit: Twitter
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన బంగ్లా బౌలర్ హసన్ మహ్ముద్ తృటిలో హ్యాట్రిక్ చేజార్చుకున్నాడు. అయితే తాను హ్యాట్రిక్ సాధించానన్న సంతోషాన్ని హసన్ మహ్ముద్ ముందే సెలబ్రేట్ చేసుకోగా, డీఆర్ఎస్ పుణ్యమా అని హసన్ మహ్ముద్‌కు ఆ సంతోష క్షణాలు కాసేమే మిగిలాయి.
విషయంలోకి వెళితే.. రెండోరోజు ఆటలో లంచ్ విరామ సమయం వరకు హసన్ మహ్ముద్ 22 ఓవర్లు బౌలింగ్ వేసి 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్ 82వ ఓవర్లో రెండు వరుస బంతుల్లో విండీస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. మొదట సెంచరీ బాదిన అమీర్ జాంగోను క్లీన్‌బౌల్డ్ చేసిన హసన్ మహ్ముద్ మరుసటి బంతికి రోస్టన్ చేజ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
దీంతో వెస్టిండీస్ 264 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయింది. హ్యాట్రిక్ ఫీట్‌పై కన్నేసిన హసన్ మహ్ముద్ విసిరిన బంతిని జోషువా బిషప్ ఆడే ప్రయత్నంలో లెగ్‌సైడ్ వెళ్లి అతడి ప్యాడ్లను తాకింది. హసన్ మహ్ముద్ వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా, అంపైర్ ఔటిచ్చాడు. దీంతో హ్యాట్రిక్ వికెట్ తన ఖాతాలో చేరిందన్న సంతోషంతో హసన్ మహ్ముద్ సెలబ్రేషన్ చేసుకున్నాడు.
అయితే విండీస్ బ్యాటర్ జోషువా రివ్యూ కోరడంతో నాటౌట్ కాదంటూ ఫలితం వచ్చింది. దీంతో షాక్ తిన్న హసన్ మహ్ముద్ హ్యాట్రిక్ మిస్ అయిపోయానని తెగ బాధపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విండీస్ 356 ఆలౌట్..
మ్యాచ్ విషయానికొస్తే వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 106.4 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. అమీర్ జాంగో (212 బంతుల్లో 133; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా, జస్టిన్ గ్రీవ్స్ (51), కెవిన్ విక్‌హమ్ (61) అర్థశతకాలతో మెరిశారు. ఆఖర్లో జోషువా బిషప్ (23), జోమెల్ వరికన్ (27) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్ముద్ ఆరు వికెట్లతో చెలరేగగా, తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
So close to a hat-trick! 😱🔥 Hasan Mahmud strikes twice in two balls but narrowly misses out on a hat-trick! What a thrilling moment in Sylhet! 🇧🇩🎯 Dutch-Bangla Bank Bangladesh 🆚 West Indies Test Series 2026, Powered by Rocket, Co-sponsor: NexusPay Official Transportation Partner: Garibook #BCB #Bangladesh #HasanMahmud #WestIndies #Day2 #TestCricket
— Bangladesh Cricket (@BCBtigers) November 6, 2026
Six wickets. One sensational spell! 🔥🎯 Hasan Mahmud tears through the West Indies batting lineup with a magnificent six-wicket haul! Take a bow! 🇧🇩👏 #BCB #Bangladesh #HasanMahmud #WestIndies #2ndTest #TestCricket https://t.co/yhv06MGEnp
— Bangladesh Cricket (@BCBtigers) November 6, 2026
ఇదీ చదవండి:


