టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో తన పరుగుల సునామీతో రికార్డులను తిరగరాయడమే కాదు.. స్టేడియం బయట కూడా అపార వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. క్రీడా రంగం ద్వారా వచ్చిన ప్రాచుర్యాన్ని ఒక అంతర్జాతీయ వాణిజ్య బ్రాండ్‌గా మలచడంలో కోహ్లీ సాధించిన విజయం నేటి యువతకు, క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రముఖ ఆర్థిక విశ్లేషణల నివేదికల ప్రకారం విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ.1,050 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా.
ఆదాయానికి మూలాలు
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భాగంగా ఏటా రూ.7 కోట్ల రిటైనర్ ఫీజుతో పాటు టెస్టులు, వన్డే మ్యాచ్ ఫీజులు వస్తాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఆడుతున్న కోహ్లీ, తాజా వేలం/రిటెన్షన్‌ల ప్రకారం ఏటా రూ.21 కోట్ల వేతనాన్ని అందుకోనున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న దిగ్గజాల్లో ఆయన ఒకరిగా నిలిచారు.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు
కోహ్లీ నికర సంపదలో దాదాపు 60 శాతానికి పైగా వాటా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల రూపంలోనే వస్తోంది. పూమా, ఎంఆర్‌ఎఫ్, ఆడి వంటి గ్లోబల్ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న కోహ్లీ ఒక్కో ఎండార్స్‌మెంట్ ప్రచారానికి రూ.7.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 260 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచిన కోహ్లీ, డిజిటల్ స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా ఒక్కో ప్రచారానికి కోట్ల రూపాయల రాబడిని పొందుతున్నారు.
సొంత వ్యాపారాలు.. స్టార్టప్‌ల్లో పెట్టుబడులు
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇన్వెస్టర్‌గా రూపాంతరం చెందిన విరాట్ కోహ్లీ బ్రాండ్లను స్థాపించారు. యువతను ఆకట్టుకునే ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘రోగ్న్’ (WROGN)లో వాటాతో పాటు స్పోర్ట్స్‌వేర్, లైఫ్‌స్టైల్ వ్యాపారం కలకిగిన ‘వన్8’ బ్రాండ్‌ను నడుపుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో డైనింగ్ అండ్ రెస్స్టారెంట్ చైన్ ‘వన్8 కమ్యూన్’ పేరుతో ప్రాచుర్యం పొందింది. డిజిట్ ఇన్సూరెన్స్, రేజ్ కాఫీ, ప్లాంట్-బేస్డ్ మీట్ కంపెనీ ‘బ్లూ ట్రైబ్’, ఫిట్‌నెస్ రంగంలోని హైపర్‌రైస్ వంటి వినూత్న వ్యాపారాల్లో భాగస్వామిగా పెట్టుబడులు పెట్టారు.
కోట్ల విలువైన లగ్జరీ ఆస్తులు
విరాట్ కోహ్లీ ఆయన సతిమణి అనుష్క శర్మల స్థిరాస్తుల పోర్ట్‌ఫోలియో విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ముంబైలోని వర్లీలో ఉన్న రూ.34 కోట్ల సముద్రపు వ్యూ కలిగిన లగ్జరీ అపార్ట్‌మెంట్, గురుగ్రామ్‌లో రూ.80 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా, అలీబాగ్‌లో నిర్మించిన లగ్జరీ ఫార్మ్‌హౌస్, విల్లాలు కోహ్లీ ప్రధాన ఆస్తులుగా ఉన్నాయి.
లగ్జరీ కార్లు
కోహ్లీ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది. తన గ్యారేజ్‌లో రూ.15 కోట్ల నుంచి రూ.145 కోట్ల (మొత్తం వేలం బ్రాండ్ విలువ ఆధారంగా) పరిధిలో అంచనా వేస్తారు. ఆయన గ్యారేజ్‌లో బెంట్లీ కాంటినెంటల్ జీటీ, ఆడి ఆర్8, లాంబోర్గిని హురకాన్, ల్యాండ్ రోవర్, పోర్షే వంటి శక్తివంతమైన సూపర్ కార్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇవి కొంటే మీ బ్యాడ్‌లక్!


