నిప్పులు చెరిగిన భార‌త బౌల‌ర్‌.. నేపాల్ టాపార్డ‌ర్ క‌కావిక‌లం | Ishan Sood-Sensational-Bowling-Rips-Nepal Top-Order-Mens U19 Asia Cup 2026 | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన భార‌త బౌల‌ర్‌.. నేపాల్ టాపార్డ‌ర్ క‌కావిక‌లం

Nov 6 2026 11:39 AM | Updated on Nov 6 2026 11:56 AM

Ishan Sood-Sensational-Bowling-Rips-Nepal Top-Order-Mens U19 Asia Cup 2026

Photo Credit: Twitter

పురుషుల అండ‌ర్‌-19 ఆసియా క‌ప్‌లో భాగంగా నేపాల్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇండియా యువ బౌల‌ర్ ఇషాన్ సూద్ బంతితో నిప్పులు చెరిగాడు. ఫ‌లితంగా నేపాల్ టాపార్డ‌ర్ క‌కావిక‌ల‌మైంది. తొలుత నేపాల్ ప్ర‌సిద్ధా జైషీ (1)ని క్యాచ్ ఔట్‌గా పెవిలియ‌ర్ చేర్చిన ఇషాన్ సూద్ ఆ వెంట‌నే సూర్యాన్షు కోయిరాలా (5)ను పెవిలియ‌న్ చేర్చాడు. 

అనంత‌రం త‌న‌ మ‌రుస‌టి ఓవ‌ర్లో నిశ్చ‌ల్ ఛెత్రీ డ‌కౌట్‌గా పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో నేపాల్ 27 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ప‌డింది. ప్ర‌స్తుతం 12 ఓవ‌ర్లు ముగిసేస‌రికి నేపాల్ 3 వికెట్ల న‌ష్టానికి 36 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ నీర‌జ్‌కుమార్ యాద‌వ్ (16), ద‌ర్శ్ సోనార్ (6) క్రీజులో ఉన్నారు.


PC: Twitter

ఇక టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా దిగ్గ‌జ క్రికెట‌ర్లు సెహ్వాగ్‌, ద్ర‌విడ్ కుమారులు ఆర్య‌వీర్ సెహ్వాగ్‌, అన్వ‌య్ ద్ర‌విడ్‌లు ఇద్ద‌రు తుదిజ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఇదీ చదవండి: ఒకే ఏడాది దిగ్గజాల వీడ్కోలు.. సాకర్‌పై చెరగని ముద్ర

రేపు రెండో వన్డే.. సిరీస్ మొత్తానికి దూరమైన కివీస్ స్టార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement