breaking news
Anvay Dravid
-
కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ
త్వరలో జరుగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ, రంజీ ట్రోఫీల కోసం కర్ణాటక జట్లను ఇవాళ ప్రకటించారు. వినూ మన్కడ్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) సారధిగా ఎంపిక కాగా.. రంజీ ట్రోఫీ జట్టుకు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) కెప్టెన్‌గా కొనసాగాడు. ఈసారి రంజీ జట్టులో పలు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కృతిక్ కృష్ణ, శిఖర్ షెట్టి, మొహిసిన్ ఖాన్ తొలిసారి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నారు.కరుణ్ నాయర్ రీఎంట్రీఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విఫలమై, విండీస్ పర్యటనకు ఎంపిక కాని కరుణ్ నాయర్ (karun Nair) కర్ణాటక రంజీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ గత రెండు రంజీ సీజన్లలో విదర్భ తరఫున ఆడాడు. గత సీజన్లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్ కీలకపాత్ర (16 ఇన్నింగ్స్‌ల్లో 53.96 సగటున 863 పరుగులు) పోషించాడు. గతకొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో పరుగులు వరద పారించి, సెంచరీల మోత మోగించి టీమిండియాకు ఎంపికైన కరుణ్ ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచాడు. అక్టోబర్ 15న రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌తో కరుణ్ కర్ణాటక తరఫున పునరాగమనం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.2025/26 రంజీ సీజన్ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గోపాల్, వైశాక్ విజయకుమార్, విద్వత్ కవేరప్ప, అభిలాష్ శెట్టి, ఎం వెంకటేష్, నికిన్ జోస్, అభినవ్ మనోహర్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), కేవీ అనీష్, మోహ్సిన్ ఖాన్, శిఖర్ శెట్టి.కెప్టెన్‌గా అన్వయ్ ద్రవిడ్50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 9 నుంచి 17 వరకు డెహ్రాడూన్‌లో జరుగనుంది. ఈ టోర్నీ కోసం కర్ణాటక జట్టు కెప్టెన్‌గా అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎస్ మణికాంత్ నియమితుడయ్యాడు.వినూ మన్కడ్ ట్రోఫీ 2025 కోసం కర్ణాటక జట్టు: అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స, ఎస్ మణికాంత్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రతన్ బీఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాల్వియా, సన్నీ కాంచి, రెహాన్ మహమ్మద్అన్వయ్ ద్రవిడ్‌కు అవార్డుగత ఎడిషన్ అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీలో (రెడ్‌బాల్) సత్తా చాటిన అన్వయ్ ద్రవిడ్‌ను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సన్మానించింది. ఈ టోర్నీలో అన్వయ్ 6 మ్యాచ్‌ల్లో 91.80 సగటున 459 పరుగులు సాధించి, కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.కాగా, రాహుల్ ద్రవిడ్ మరో కుమారుడు (పెద్దవాడు) కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. తమ్ముడు అండర్-16 విభాగంలో సత్తా చాటుతుంటే, అన్న సమిత్ సీనియర్ లెవెల్లో పర్వాలేదనిపిస్తున్నాడు. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్. చదవండి: తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు.. -
తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు..
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారులు ఇద్దరూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్, చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) కర్ణాటక క్రికెట్ జట్టు తరఫున సత్తా చాటుతున్నారు.సమిత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కాగా అండర్-16 క్రికెట్లో సత్తా చాటుతున్న అన్వయ్‌కు తాజాగా అవార్డు లభించింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అతడిని సత్కరించింది.అత్యధిక పరుగుల వీరుడిగా మయాంక్తమ రాష్ట్రం తరఫున సత్తా చాటుతున్న క్రికెటర్లకు కేఎస్‌సీఏ ప్రతి ఏడాది అవార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా టీమిండియా వెటరన్ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను సత్కరించింది.గతేడాది దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగార్వల్ సగటు 93తో 651 పరుగులు చేసి.. లిస్ట్-ఎ క్రికెట్లో కర్ణాటక తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ వరుసగా రెండో ఏడాది సత్తా చాటి అవార్డు అందుకున్నాడు.రెండు సెంచరీలు.. 459 పరుగులు.. అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీ (రెడ్‌బాల్)లో భాగంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన అన్వయ్.. 91.80 సగటుతో 459 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. 46 బౌండరీలు కూడా అన్వయ్ ఖాతాలో చేరాయి. తద్వారా కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి అన్వయ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో తండ్రి తగ్గ తనయుడు అంటూ అన్వయ్‌ను ద్రవిడ్ అభిమానులు కొనియాడుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ.. టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.వీరికి కూడా అవార్డులుఇదిలా ఉంటే.. మిగతా వారిలో ఎడమచేతి వాటం బ్యాటర్ ఆర్. స్మరణ్ రంజీ ట్రోఫీలో రెండు శతకాల సాయంతో 516 పరుగులు చేసి.. టాప్ రన్ స్కోరర్‌గా అవార్డు అందుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో వాసుకీ కౌశిక్ గతేడాది 23 వికెట్లు పడగొట్టి పురస్కారం అందుకున్నాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవాకు ఆడబోతుండటం గమనార్హం.అదే విధంగా.. లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ శ్రీజిత్ కూడా సత్తా చాటి పురస్కారాలు అందుకున్నారు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోపాల్ 14 వికెట్లు తీయగా.. శ్రీజిత్ 213 పరుగులు సాధించాడు.ఇక మహిళా క్రికెటర్లకు కూడా KSCA ఈ సందర్భంగా అవార్డులు అందజేసింది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన నికీ ప్రసాద్, మిథిలా వినోద్‌లను సత్కరించింది. అదే విధంగా పర్ఫామెన్స్ అనలిస్ట్ మాలా రంగస్వామికి కూడా అవార్డు అందజేసింది.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
కొడుకుతో కలిసి బరిలోకి దిగిన రాహుల్ ద్రవిడ్.. తండ్రి విఫలం.. కొడుకు హాఫ్ సెంచరీ
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ 12 ఏళ్ల తర్వాత క్లబ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. చిన్న కొడుకు అన్వయ్‌తో కలిసి నసుర్ మెమొరియల్ షీల్డ్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ద్రవిడ్ విజయా క్రికెట్ క్లబ్‌కు (మాలుర్) ప్రాతినిథ్యం వహించాడు. యంగ్ లయన్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ద్రవిడ్ 8 బంతుల్లో బౌండరీ సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ విఫలమైనా కొడుకు అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్.. 58 బంతుల్లో 8 బౌండరీల సాయంతో 60 పరుగులు చేశాడు. రాహుల్-అన్వయ్ కొద్ది సేపు కలిసి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు 17 బంతుల్లో 15 పరుగులు జోడించారు. క్రికెట్ చరిత్రలో తండ్రి కొడుకులు కలిసి ఆడటం చాలా అరుదుగా జరిగింది.కలిసి క్రికెట్ ఆడిన కొంతమంది తండ్రి కొడుకులు..డబ్ల్యూజీ గ్రేస్-గ్రేస్ జూనియర్లాలా అమర్నాథ్-సురిందర్ అమర్నాథ్డెన్నిస్ లిల్లీ-ఆడమ్ లిల్లీడెనిస్ స్ట్రీక్- హీథ్ స్ట్రీక్శివ్నరైన్ చంద్రపాల్-తేజ్ నరైన్ చంద్రపాల్ఇయాన్ బోథమ్-లియామ్ బోథమ్ఇలా చేయడం ద్రవిడ్‌కు కొత్తేమీ కాదు..!రిటైర్మెంట్ తర్వాత క్లబ్ క్రికెట్ ఆడటం ద్రవిడ్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో పలుమార్లు తన చిన్ననాటి క్లబ్ అయిన బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. ఈ జట్టుకు ఆడుతూ ద్రవిడ్ ఓ సెంచరీ కూడా చేశాడు.ద్రవిడ్ పెద్ద కొడుకు కూడా క్రికెటరే..!ద్రవిడ్ చిన్న పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటరే. గతేడాది ఆగస్ట్‌లో సమిత్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. గతేడాది మహారాజా టీ20 టోర్నీలోనే సమిత్ పాల్గొన్నాడు.ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ద్రవిడ్రాహుల్ ద్రవిడ్ ఇటీవలే తన హో సిటీ బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరుకు రాక ముందు ద్రవిడ్ గౌహతిలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రీ సీజన్ క్యాంప్‌లో పాల్గొన్నాడు. ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో స్వప్నిల్ అనే ఆటగాడు సుడిగాలి శతంకంతో విజృంభించడంతో విజయ క్రికెట్ క్లబ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. స్వప్నిల్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. యంగ్ లయన్స్ బౌలర్లలో ఆధిత్య నాలుగు వికెట్లు పడగొట్టాడు. -
శతక్కొట్టిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
మూలపాడు (ఆంధ్రప్రదేశ్): భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ (153 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకున్నాడు.మూడు రోజుల మ్యాచ్‌లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్‌లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్ మొదట శమంతక్ అనిరుధ్ (76)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగులు జతచేశాడు.387 పరుగులకు ఆలౌట్అనిరుధ్ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్ (33)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.జోనల్ టోర్నమెంట్లో డబుల్ సెంచరీఅన్వయ్ ద్రవిడ్ గతేడాది కర్ణాటక అండర్–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ టోర్నీకి ముందు జరిగిన కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్ సంఘం) అండర్–16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో బెంగళూరు జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్... తుంకూర్ జోన్‌పై చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీ (200 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు.ఇక అన్వయ్ అన్నయ్య 19 ఏళ్ల సమిత్ కూడా ఇదివరకే జూనియర్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో సమిత్ ద్రవిడ్ రాణించాడు. చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు


