అందుకే వైభవ్‌ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ | India Announces U-19 Teams For Tri-Series Against Afghanistan, Vaibhav Suryavanshi And Ayush Mhatre Left Out | Sakshi
Sakshi News home page

భారత జట్టులో ఆయుశ్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీలకు దక్కని చోటు.. కారణం ఇదే

Nov 12 2025 8:09 AM | Updated on Nov 12 2025 10:36 AM

India Announces U19 Squads For Tri Series Vaibhav Suryavanshi Ayush Misses Out

అఫ్గనిస్తాన్‌ అండర్‌-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తమ జట్లను ప్రకటించింది. అండర్‌-19 స్థాయిలోని ‘ఎ’, ‘బి’ జట్లు సొంతగడ్డపై అఫ్గన్‌ జట్టుతో అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో నవంబర్‌ 17 నుంచి 30 వరకు ఈ సిరీస్‌ జరుగుతుంది.  

కాగా తమ అండర్‌-19 జట్టు భారత్‌- ‘ఎ’, ‘బి’ జట్లతో యూత్‌ వన్డే ట్రై సిరీస్‌ ఆడనున్నట్లు ఇటీవలే అఫ్గనిస్తాన్‌ బోర్డు ప్రకటించింది. ఐసీసీ మెన్స్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్‌ సన్నాహకంగా ఉంటుందని పేర్కొంది.

ఆయుశ్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీలకు దక్కని చోటు
ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో సిరీస్‌కు తాజా తమ జట్లను ప్రకటించిన భారత్‌.. అనూహ్యంగా ఈ టీమ్‌ నుంచి సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రేలను తప్పించింది. కాగా పద్నాలుగేళ్ల వైభవ్‌ గత కొంతకాలంగా భారత్‌ తరఫున సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. 

ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్‌ అండర్‌-19 జట్టులో భాగమైన ఈ బిహారీ పిల్లాడు.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో యూత్‌ వన్డేలు, యూత్‌ టెస్టుల్లో దుమ్మురేపే ప్రదర్శనలు ఇచ్చాడు.

ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌తో ట్రై సిరీస్‌లోనూ వైభవ్‌ సూర్యవంశీ భాగం కావడం లాంఛనమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఈ సిరీస్‌ ఆడే రెండు భారత జట్లలోనూ వైభవ్‌ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అదే విధంగా.. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రేను కూడా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

అందుకే వైభవ్‌ను ఎంపిక చేయలేదు
ఇందుకు గల కారణాన్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ‘‘వైభవ్‌ సూర్యవంశీ పేరును ఈ సిరీస్‌కు పరిశీలించలేదు. అతడు ఇండియా- ‘ఎ’ తరఫున ఆసియా క్రికెట్‌ మండలి నిర్వహించే రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ టోర్నీకి ఎంపికయ్యాడు కాబట్టి.. ఈ సిరీస్‌ నుంచి పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.

ఇక ముంబై తరఫున ప్రస్తుతం రంజీల్లో ఆడుతున్న కారణంగా ఆయుశ్‌ మాత్రేను కూడా పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌ అండర్‌-19తో తలపడే భారత ‘బి’ టీమ్‌లో వికెట్‌ కీపర్‌గా టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌కు చోటు దక్కడం విశేషం.

అఫ్గనిస్తాన్‌ అండర్‌-19 జట్టుతో తలపడే భారత అండర్‌-19 ‘ఎ’ జట్టు ఇదే
విహాన్ మల్హోత్రా (కెప్టెన్‌), అభిజ్ఞాన్ కుందు (వైస్‌ కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్ V.K), లక్ష్య రాయచందానీ, A. రాపోల్ (వికెట్ కీపర్‌), కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ పటేల్‌, అన్మోల్‌జీత్‌ సింగ్‌, మొహమ్మద్‌ ఇనాన్‌, హెనిల్‌ పటేల్‌, అశుతోష్‌ మహిదా, ఆదిత్య రావత్‌, మొహమ్మద్‌ మాలిక్‌.

భారత్‌ అండర్‌-19 ‘బి’ జట్టు
ఆరోన్‌ జార్జ్‌ (కెప్టెన్‌), వేదాంత్‌ త్రివేది, యువరాజ్‌ గోహిల్‌, మౌల్యరాజాసిన్హ్‌ చావ్డా, రాహుల్‌ కుమార్‌, హర్‌వన్ష్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), అన్వయ్‌ ద్రవిడ్‌ (వికెట్‌ కీపర్‌), ఆర్‌ఎస్‌ అంబరీశ్‌, బీకే కిషోర్‌, నమన్‌ పుష్పక్‌, హేముచుందేషన్‌ జె, ఉద్ధవ్‌ మోహన్‌, ఇషాన్‌ సూద్‌, డి దీపేశ్‌, రోహిత్‌ కుమార్‌ దాస్‌.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టు 
ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్‌ కెప్టెన్‌), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, అభిషేక్‌ పోరెల్ (వికెట్‌ కీపర్‌), సుయాష్ శర్మ. 

చదవండి: శభాష్‌ షహబాజ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement